తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపరిమితమైన జ్ఞానం, దర్శకత్వం అనే క్రాఫ్ట్ మీద విపరీతమైన పట్టు ఉన్న గొప్ప టెక్నీషియన్ రాంగోపాల్ వర్మ. అలాంటి గొప్ప వ్యక్తి, సినిమా మేకింగ్ మీద మంచి కమాండ్ ఉన్నప్పటికీ.. మనసుపెట్టి పనిచేసే అలవాటు మర్చిపోయి.. టైంపాస్‌గా ఏదో రోజు గడవడానికి తనను ఆశ్రయించిన నిర్మాతలకు ఏది కావాలంటే అది ‘తీసిపారేసి’ జనాలకు మీదకు సినిమాల రూపంలో చెత్తను కుమ్మరిస్తున్న దర్శకుడిగా తయారయ్యాడు.
రాంగోపాల్ వర్మ డైరక్షన్ లో వచ్చిన చివరి సినిమా ఏది? అనే ప్రశ్న అడిగితే.. ఆయన వీర అభిమానులు కూడా టక్కున సమాధానం చెప్పలేరు. ఆయన అభిమానులంతా.. ఇప్పుడు ఆయన సినిమాలకు కాకుండా ఆయన జ్ఞానానికి ఫ్యాన్స్ గా మారుతున్నారు. అంటే ఆయన సినిమాలు చెత్త తప్ప మరేం కాదని వారు కూడా నమ్ముతున్నారు. అలాంటి దర్శకుడు కేవలం వివాదాలతోనే తనను తాను మార్కెట్ చేసుకోవడం తెలిసిన వ్యక్తి. ఒక గట్టి వివాదాన్ని రేకెత్తించడం.. ఆ పునాదుల మీద ప్రధానంగా తనను మార్కెట్ చేసుకోవడం.. ఆ పరంగా తనకు కొత్త కస్టమర్లు దొరికిన తర్వాత.. వారికోసం చేసే చెత్త సినిమాలను మార్కెట్ చేసుకోవడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది.
సదరు వర్మ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గంపగుత్తగా వందకోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి. ఆల్రెడీ యాభైకోట్ల ఎడ్వాన్సులు ముట్టాయని.. తెలుగుదేశం, జనసేన పార్టీల పరువు తీసేలా.. జగన్ మహానుభావుడని ప్రజలను నమ్మించేలా రాబోయే ఏడాదిలో ఆయన బోలెడన్ని సినిమాలు తీసి జనం మీదికి సంధించాలని ఆ వందకోట్ల ఒప్పందం సారాంశంగా కూడా గుసగుసలు ఉన్నాయి.
వంద కాకపోతే రెండొందల కోట్లు కూడా కావొచ్చు. రాంగోపాల్ వర్మ ఒక దర్శకుడిగా వైసీపీ కోసం సినిమాలు తీయడానికి మాత్రమే అమ్ముడుపోయాడా? లేదా.. పూర్తిగా తే బుద్ధిని కూడా అమ్మకానికి పెట్టాడా అనేది ఇప్పుడు రేకెత్తుతున్న ప్రశ్న.
పవన్ కల్యాణ్.. తన పార్టీ రాజకీయ విధానాల్లో భాగంగా పొత్తుల గురించి ప్రకటన చేస్తే.. దానిని ఎద్దేవా చేస్తూ ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.తెదేపాతో సఖ్యంగా ఉంటూ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనేది పవన్ ఎజెండా కాగా, పవన్ ను రెచ్చగొట్టి తెదేపాతో సఖ్యతను చెడగొట్టాలనేదే టార్గెట్ అన్నట్టుగా ఆర్జీవి పిచ్చి పిచ్చి ట్వీట్లు చేయడం వివాదాస్పదం అవుతోంది. ఆర్జీవీ మరీ అంతగా అమ్ముడుపోవాలా అని జనం అనుకుంటున్నారు.
మరీ అంతగా అమ్ముడుపోవాలా ఆర్జీవీ!
Thursday, December 19, 2024