భూమునకు పదవి: వైసీపీలో యాదవ ముసలం!!

Sunday, December 22, 2024

ఈసారి టీటీడీ ధర్మకర్తల మండలి కూర్పులో బీసీలకు పెద్దపీట ఉంటుందని, కొన్ని నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగా ప్రచారం చేస్తూ వచ్చారు. బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ధర్మకర్తల మండలి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని కూడా ప్రచారం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి పదవి ఇస్తే, ఆ వర్గానికి న్యాయం జరిగినట్లు అవుతుందని.. తిరుమల వెంకటేశ్వరుని సేవలో యాదవ  సామాజిక వర్గానికి ఉండే ఆధ్యాత్మిక,  చారిత్రక అనుబంధాన్ని గౌరవించినట్టు కూడా అవుతుందని పలువురు భావించారు. అయితే చివరి నిమిషంలో జంగా కృష్ణమూర్తిని పక్కనపెట్టి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర రెడ్డికి పగ్గాలు అప్పగించారు. ఈ నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే యాదవ కులానికి చెందిన నాయకుల్లో అసంతృప్తి పెచ్చరిల్లుతోంది. తమ కులాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప వైయస్సార్ కాంగ్రెస్ తమకేమీ చేయడం లేదంటూ నిరసన గళాలు వినిపిస్తూ వారు పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

కులాల సమతూకం పాటిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. బీసీలకు తమ పార్టీ పెద్దపీట వేసినంతగా మరెవ్వరూ కూడా ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టులలోకి అత్యంత కీలకమైన టీటీడీ ధర్మకర్తల మండలి సారథ్యం విషయానికి వచ్చేసరికి రెడ్డి సామాజిక వర్గం తప్ప మరొకరు కనిపించలేదా అనే ప్రశ్న ప్రజల నుంచి, ప్రధానంగా బీసీ నాయకులు నుంచి వినిపిస్తోంది. ఆశపెట్టి వంచించడం పట్ల యాదవులు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ప్రధాన అనుచరుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్ యాదవ్ తన అసంతృప్తిని దాచుకోలేకపోతున్నారు. తన భార్య ఆదోని మునిసిపల్ కౌన్సిలర్ గా ఉన్న పద్మతో సహా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించేశారు. వైసీపీకి యాదవులు అండగా ఉంటున్నా సరే వారిని చిన్న చూపు చూస్తున్నందుకే ఇలా చేసినట్లు వెల్లడించారు. వైసీపీలోని యాదవులందరూ కూడా పార్టీ చేస్తున్న మోసాన్ని అర్థం చేసుకుని బయటకు రావాలని పిలుపు ఇచ్చారు.

ప్రస్తుతానికి ఇది ఒకే ఒక్క తిరుగుబాటు సంఘటన మాత్రమే కావచ్చు. కానీ టీటీడీ చైర్మన్ వ్యవహారం పర్యవసానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో మరింత మంది బీసీ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవంతా వీరు స్వయంగా చేస్తున్నట్లయితే అదొక ఎత్తు… అలాకాకుండా టీటీడీ చైర్మన్ పదవి దక్కబోతున్నదని చివరి నిమిషం వరకు ఆశలు పెట్టుకొని భంగపడిన సీనియర్ నాయకుడు జంగా కృష్ణమూర్తి పార్టీలోని యాదవ గ్రూపుల వెనుక ఉండి నడిపిస్తున్నట్లయితే గనుక అది అధికార పక్షానికి మరింత ప్రమాదకరం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles