బిజెపిని మించి సెంటిమెంటు ప్లే చేస్తున్న ఆదిపురుష్!

Wednesday, January 22, 2025

మతాన్ని దేవుడిని తమ రాజకీయ ప్రచార అస్త్రంగా వాడుకోవడంలో భారతీయ జనతా పార్టీని మించిన వారు లేరు. కేవల హిందూ అనుకూల ఎజెండా మాత్రమే కాకుండా, ముస్లిం వ్యతిరేక, విద్వేష ఎజెండాను కూడా ఎక్కడికక్కడ తమకు కన్వీనియెంట్ గా వాడుకుంటూ.. రాజకీయ లబ్ధి పొందడానికి భాజపా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదే బాటను రామాయణం ఆధారంగా తీసిన సినిమా అని చెప్పుకుంటున్న ఆదిపురుష్ మేకర్స్ కూడా అనుసరిస్తున్నరు.
భారతీయ జనతా పార్టీ అయితే.. మొన్నటి కర్ణాటక ఎన్నికల్లో ఒక మెట్టు దిగి, చవకబారు రాజకీయ ప్రచారంగా హనుమంతుడిని కూడా తమ ఎన్నికల అస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే బజరంగదళ్ వంటి అతివాద హిందూ సంస్థలను నిషేధిస్తాం అని కాంగ్రెస్ చెప్పినందుకు, హనుమంతుడు పుట్టిన రాష్ట్రంలోనే ఇలాంటి అవమానమా? హనుమంతుడంటే మీకు ఎందుకంత ద్వేషం? లాంటి డైలాగులతో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలని ప్రయత్నించి భంగపడింది.
ఇప్పుడు ఆదిపురుష్ వంతు వచ్చింది. రామాయణం ఆధారంగా సినిమా ఉంటుంది సరే.. ప్రభాస్ రాముడిగా అద్భుతంగా ఉన్నాడు గానీ.. సినిమా గ్రాఫిక్సే తొలి టీజర్ నుంచి కూడా అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ఏదేమైనా మొత్తానికి సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర రూపకర్తలు ఒక గిమ్మిక్ ప్రయోగించారు. ఆదిపురుష్ సినిమా ప్రదర్శన జరిగే ప్రతి థియేటర్లోనూ ఒక టికెట్ విక్రయించకుండా ఆ సీటు ఖాళీ ఉంచుతారట. ఆ సీటును హనుమంతుడికోసం ప్రత్యేకంగా ఉంచుతారట. ‘‘రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటకి హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. అతిగొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ హంగులతో నిర్మించిన “ఆదిపురుష్”ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం’’ అంటూ సినిమా రూపకర్తలు ట్వీట్ చేశారు.
మొత్తానికి హనుమంతుడిని సినిమా ప్రచారానిచాలా బాగా వాడేస్తున్నారన్నమాట. తాము కూర్చుని ఉన్న థియేటర్లో ఖాళీగా ఉన్న సీట్లో హనుమంతుడు కూడా ఉన్నాడు.. అనే ఫీల్ ను ప్రేక్షకులకు ఇవ్వడానికి ఈ ఎత్తుగడ. ఇదే హాల్లో ఎక్కడో ఓచోట హనుమంతుడు ఉంటాడు అనకుంటూ జనం ఎగబడి చూస్తారని వారి ఆలోచన. అందుకే, ఆదిపురుష్ మేకర్స్ దేవుడిని తమ ప్రచారం కోసం వాడుకోవడంలో బిజెపిని మించి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles