జగన్ సర్కారు మీద విమర్శల దాడి చేయడంలో, ప్రభుత్వ అవినీతి అరాచకాలను వెలికి తీయడంలో, వాటిగురించి ప్రజల్లో చైతన్యం కలిగించడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పుడు టాప్ గేర్ లోకి వెళుతున్నారు. నెమ్మదిగా ఆయన తన జోరు పెంచుతున్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ ప్రశ్నించడం మొదలైన తరువాత.. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వాలంటీర్లు ఏ ఇంటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు అడిగినా సరే.. వారికి ప్రజల నుంచే ప్రశ్నల పరంపర తప్పడం లేదు. వ్యక్తిగత వివరాలు ఎందుకు ఇవ్వాలని నిలదీయడం జరుగుతోంది. వాలంటీర్ల అధికారిక హోదా ఏమిటి తమ వద్ద తీసుకున్న వ్యక్తిగత వివరాలను ఎక్కడ భద్రపరుస్తున్నారు ఎవరెవరికి అందజేస్తున్నారు ఇలాంటి ప్రశ్నలతో ప్రజలే ఎదురు దాడికి దిగుతున్నారు.
వాలంటీర్ల విషయంలో సర్కారు బండారం ఇలా బజారున పడ్డ కొన్ని రోజులకే జనసేనాని పవన్ కళ్యాణ్ మరో విషయంపై దాడి ప్రారంభించారు. బైజుస్ ద్వారా ఎనిమిదో తరగతి పాఠాలను ప్రీలోడింగ్ చేసిన ట్యాబ్ లను విద్యార్థులకు అందజేసే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఉచితంగా పాఠాలను అందిస్తుందనే ముసుగులో ఎన్ని రకాల సరికొత్త దోపిడీ మార్గాలను జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నదో పవన్ కళ్యాణ్ కొత్తగా ప్రశ్నిస్తున్నారు.
బైజూస్ కంపెనీ కంటెంట్ ఉచితంగా ఇస్తుందా? ప్రతి సంవత్సరం ఇలాగే ఇస్తూ ఉంటుందా? అలా కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఖర్చులు ఎవరు భరిస్తారు? వచ్చే సంవత్సరం కూడా మళ్లీ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేయడం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలను పవన్ అడుగుతున్నారు. ఎనిమిదవ తరగతికి పాఠాలను ఉచితంగా లోడ్ చేసి ఇస్తుండగా, అదే విద్యార్థులు 9వ తరగతికి వచ్చిన తర్వాత ఆ ఏడాది పాఠాలను అందించడానికి భారీగా బిల్ చేస్తుందనేది ప్రచారంలో ఉన్న భయం. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం బయట పెట్టకుండా అర్థసత్యాలు మాట్లాడుతూ గుట్టు చప్పుడు కాకుండా పని నడిపిస్తోందనే విమర్శలున్నాయి.
ఈ అరాచకాలను పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. బైజూస్‌లో జరిగే దోపిడీలను నిలదీస్తున్నారు. ప్రతి సంవత్సరం 750 కోట్ల కంటే ఎక్కువ తగలేసే బదులుగా, టీచర్ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేస్తే విద్యా వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుందని పవన్ అంటున్నా న్నారు. మరి పవన్ కళ్యాణ్ చెబుతున్న హిత వాక్యములు జగన్ ప్రభుత్వానికి తలకెక్కుతాయా? లేదా? అనేది వేచి చూడాలి!!
పవన్ ప్రశ్నలకు సర్కారు వద్ద జవాబుల్లేవ్!
Friday, November 15, 2024