నా కోసం నా కొడుకు వంట చేస్తున్నాడంటున్న చిరు సతీమణి

Wednesday, January 22, 2025

నా కోసం నా కొడుకు వంట చేస్తున్నాడంటున్న చిరు సతీమణి!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్‌ తన తల్లి, సతీమణి కోసం చెఫ్‌ అవతారమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చరణ్‌ ఇంతకు ముందు కూడా చాలా సార్లు  వంటగదిలో గరిటె తిప్పుతూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

తాజాగా ఉమెన్స్‌ డే ను పురస్కరించుకుని రామ్‌ చరణ్‌ మరోసారి వంటగదిలో ప్రత్యక్షమయ్యారు.  ఈ వీడియోలో ముందు చిరంజీవి సతీమణి సురేఖ వంట గదిలో దోశలు వేస్తూ ఉంటారు. అప్పుడూ ఉపాసన.. అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్‌ లో ఏమవుతుంది? అంటూ అడిగింది. దానికి సురేఖ నవ్వుతూ ఏమవుతుంది..దోశ అవుతుంది అంటూ బదులిచ్చారు.

ఇంతలో చరణ్‌ పక్కగా దోశలు తిరగేస్తూ కనిపించారు. ఈరోజు నాకోసం నా కొడుకు చరణ్‌ కుకింగ్‌ చేస్తున్నాడు అంటూ సురేఖ అంటే దానికి బదులుగా ఉపాసన ” అవునా ఈరోజు ఉమెన్స్‌ డే కదా..ఇలా అయితే ప్రతి రోజూ ఉమెన్స్‌ డే అయితే చాలా బాగుంటుంది” అంటూ ఉపాసన అన్నారు.

ఆ తరువాత చరన్‌ గారు ఏం వండుతున్నారండీ అంటూ చాలా క్యూట్‌ గా చరణ్‌ ని ఉపాసన ప్రశ్నించారు. దానికి సమాధానంగా చరణ్‌ మా అమ్మ కోసం పన్నీర్‌ టిక్కా చేస్తున్నానంటూ సమాధానం చెప్పాడు. ఈ వీడియో ని సోషల్‌ మీడియాలో అలా పోస్ట్‌ చేశారో లేదో తెగ వైరల్‌ అయిపోయింది. మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది.

ఈ వీడియో చూసిన చరణ్‌ అభిమానులు చరణ్‌ అన్న నువ్వు సూపర్‌, కేక, పర్ఫెక్ట్‌ కొడుకు, భర్త అంటూ తెగ పొగిడేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కొద్ది రోజుల ముందు చరణ్‌ దంపతులు ముఖేష్‌ అంబానీ కుమారుడి ప్రీ వెడ్డింగ్‌ కి విమానంలో వెళ్తున్న సమయంలో కూడా చరణ్‌ ఉపాసన కాళ్లను మర్దన చేస్తూ కనిపించారు. అంతకు ముందు చెర్రీ తన భార్య కోసం చేసిన ఫిష్‌ ప్రై వీడియో కూడా తెగ వైరల్‌ అయ్యింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles