తెరమీదకు వస్తున్న తరతరాల నాటి వైరం!

Sunday, December 22, 2024

ఫ్యాక్షన్ కుటుంబాల గురించి మాత్రమే మనం చెప్పుకుంటూ ఉంటాంగానీ.. అంతకంటె మిన్నంగా రాజకీయ కుటుంబాల మధ్య కూడా తర తరాలుగా వైరం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో అలాంటి తరాలనాటి వైరం మళ్లీ తెరమీదకు వస్తోంది. పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబాలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేది అందరికీ తెలుసు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు బరిలో మళ్లీ ఈ రెండు కుటుంబాలు.. ఉప్పూనిప్పుగా తలపడబోతున్న అవకాశం కనిపిస్తోంది.

 వైసిపి అధినేత జగన్ స్వంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లా లోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోరుకు తెరలేవనుంది. ఇక్కడ నుండి వైసిపి అభ్యర్థి గా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం వైసిపి లోక్‌సభా పక్ష నాయకుడు గా, వైసిపి పార్టీకి ఢిల్లీ రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతేకాక లోక్ సభ ప్యానల్ స్పీకర్ గా కూడా ఉన్నారు. మిథున్ రెడ్డి గత ఎన్నికల్లో ఒకసారి బిజెపి అభ్యర్థి, ప్రస్తుతం ఏపీ బిజెపి పార్టీ అధ్యక్షురాలు అయిన పురంధేశ్వరి మీద కూడా గెలుపొందడం జరిగింది. మిథున్ రెడ్డి తండ్రి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా లోనే కాక, రాష్ట్ర రాజకీయాల్లో సైతం ముఖ్య పాత్ర వహిస్తున్నారు.

 ఏపీ లో వచ్చే ఎన్నికల్లో బిజెపి, టిడిపి పొత్తు దాదాపు ఖరారు అయినట్లు భావిస్తున్న నేపథ్యంలో పొత్తు లో భాగంగా రాజంపేట పార్లమెంటు సీటు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పనిచేసిన, ప్రస్తుతం బిజెపి పార్టీ లో ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి అభ్యర్థి గా పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం లోని.. ఆయన తన స్వంత నియోజకవర్గం అయిన పీలేరు తో పాటు, మదనపల్లె, రాజంపేట, రాయచోటి, కోడూరు , తంబళ్లపల్లె అసెంబ్లీల వారీగా మూడు రోజుల పాటు బిజెపి పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మిథున్ రెడ్డి తండ్రి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి తరాలుగా రాజకీయ వైరం ఉంది. ఇద్దరూ గతంలో ఓకే పార్టీ (కాంగ్రెస్)లో ఉన్నా, ఒకరి పొడ ఒకరికి గిట్టకుండా రాజకీయ ఎత్తులు, పై ఎత్తులు వేసుకొనే వారు. అదే సమయంలో కిరణ్ స్వంత నియోజకవర్గం అయిన పీలేరు లో కిరణ్ కుమార్ తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి, టిడిపి పొత్తు కుదిరితే తన తమ్ముడు గెలిపించడంతో పాటు, తన చిరకాల ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ని ఓడించి, తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఈ మాజీ ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles