జీఓ నెం.1పై ముప్పేట దాడి.. వెనక్కు తగ్గక తప్పదా?

Wednesday, January 22, 2025

కొత్తసంవత్సరం వచ్చిన తర్వాత.. జగన్ సర్కారు తీసుకువచ్చిన మొట్టమొదటి జీవో.. ప్రతిపక్షాల పీక నొక్కడానికి ఉద్దేశించినదే కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. అయితే కొత్త ఏడాదిలో ఈ మొట్ట మొదటి జీవో విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదా? ఆ జీవోను వెనక్కు తీసుకోవాల్సి వస్తుందా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఈ చీకటి జీవో విషయంలో విపక్షాలు అన్నీ ఒక్కటవుతున్నాయి. కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే కాదు.. ప్రజాసంఘాలు కూడా తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కొత్త సంవత్సరం తొలినిర్ణయానికే జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చుననే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. 

చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో జీవో నెం.1 ఆంక్షల పేరుతో పోలీసులు ఎంత రాద్ధాంతం సృష్టించారో అందరికీ తెలుసు. తెలుగుదేశం కార్యకర్తల మీద లాఠీఛార్జి కూడా జరిగింది. అదే తెలుగుదేశం నాయకుల మీద హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. ఒక సీఐని జెండా కర్రతో పొడిచి హత్య చేయడానికి ప్రయత్నించారనే విషయంలో ఏకంగా అరవై మంది మీద కేసులు పెట్టడం ఒక చిత్రం. ఇలాంటి దుర్మార్గపు పరిణామాలపై చంద్రబాబునాయుడుకు సంఘీభావం తెలియజేయడానికి పవన్ కల్యాణ్ ఆయన ఇంటికి వెళ్లడం.. ఇద్దరు నాయకులు కలిసి జీవో నెం.1 కు వ్యతిరేకంగా ఐక్యపోరాటం చేస్తామని ప్రకటించడం జరిగింది. సరిగ్గా అదే సమయానికి విజయవాడలో కూడా పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో ఇదే జీవోకు వ్యతిరేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరగడం విశేషం. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాసంఘాల నాయకులందరూ కూడా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. అయితే ఇప్పటిదాకా బిజెపి ఒక్కటే ఈ ఐక్యపోరాటంలోకి అడుగుపెట్టలేదు. కానీ బిజెపి నాయకులందరూ కూడా ఈ జీవోను తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

ఈనేపథ్యంలో ఈ జీవోకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు, న్యాయపోరాటాలు కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలు ప్రజాసంఘాలు అందరితో కలిసి ప్రజాపోరాటాలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఒక వ్యూహం ప్రకారం వెళతామని, ఇదే విషయంపై న్యాయపోరాటం కూడా ఉంటుందని ఆయన తెలియజేశారు. 

అయితే జీవో నెం.1 ఆంక్షలతో ప్రతిపక్షాలపై కత్తి ఝుళిపించిన తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీకి చెందిన నాయకుల కార్యక్రమాలు అనేకం రోడ్ షోలుగా విచ్చలవిడిగా, జీవోను ధిక్కరించి జరుగుతున్నాయి. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వీడియో ఆధారాలను తెలుగుదేశం, ప్రజాసంఘాలు సేకరిస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో ఆధారాలన్నీ పెట్టి.. అసలు జీవోనెం.1 అనేది ప్రాథమిక హక్కును కబళించేసేలా ఉంటే.. దానిని కేవలం ప్రతిపక్షాల మీద మాత్రం ఉపయోగిస్తూ.. అధికార పార్టీ విచ్చలవిడిగా ధిక్కరిస్తోందని కూడా కోర్టుకు ఫిర్యాదు చేయనున్నారు. అక్కడిదాకా వస్తే.. రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోను.. హైకోర్టు కొట్టివేసే అవకాశమే ఎక్కువ. అక్కడిదాకా వస్తే.. కోర్టు నిర్ణయానికి రెండు రోజుల ముందు ఆ జీవోను జగన్ ఉపసంహరించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా వెనక్కు తగ్గక తప్పదని, మడమ తిప్పవలసిందేనని పలువురు  విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles