జగన్ 4 ఏళ్లు : అభివృద్ధి పట్టని విధ్వంసక ముద్ర!

Thursday, December 19, 2024

ముఖ్యమంత్రిగా జగన్ పరిపాలన నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నాలుగేళ్లలో ఆయన ఏం సాధించారు. ఎలాంటి కీర్తి సంపాదించారు. ఎంత అభివృద్ధిని సాధించారు? ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా ప్రతి ఒక్కరికీ కలుగుతుంటాయి. జగన్ సంక్షేమ పథకాల ముసుగులో ఒక నిర్దిష్టమైన ఓటుబ్యాంకును తయారుచేసుకుంటూ, ఆ జనానికి అందరికీ విపరీతంగా డబ్బులు పంచిపెడుతుండవచ్చు గాక. కేవలం అప్పులు తీసుకువచ్చి ఆ అప్పులను ఇక్కడ ప్రజలకు పంచేసి తన ఓటుబ్యాంకును పదిలంగా మార్చుకుంటున్నాననే భ్రమలో ఉండవచ్చు గాక.. కానీ వాస్తవంలో
ఆయనకు దక్కుతున్న కీర్తి ఎలాంటిది?
జగన్ అంటేనే విధ్వంసక సీఎం అనే కీర్తిని జగన్ సంపాదించుకున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రజావేదికను కూల్చడం ద్వారా.. తను రాబోయే అయిదేళ్ల పాటు ఏం చేయాలనుకుంటున్నారో.. స్పష్టమైన సంకేతం ఇచ్చారు. చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉండే, ఆయన నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి.. అక్కడి శిథిలాలను కనీసం తొలగించకుండా.. అటుగా వెళ్లిన ప్రతిసారీ చంద్రబాబుకు ఒక మానసిక క్షోభను కలిగించనని జగన్ అనుకున్నారు. కానీ.. వాస్తవంలో.. అక్కడ పదిలంగా ఉన్న శిథిలాలే.. తన మీద విధ్వంసక సీఎంగా ముద్రవేస్తాయని ఆయన ఊహించి ఉండరు.
దానితో మొదలైన జగన్ విధ్వంసం అన్న క్యాంటీన్ల మీద పడింది. రాష్ట్రవ్యాప్తంగా పేదల కడుపు నింపుతున్న, ఆకలిగొన్న వారికి అంత అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్ల మీద పడ్డారు. వాటిని మూసేశారు. పేదల కడుపాకలిపై జగన్ కు అంత కక్ష ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. విధ్వంసకాండ ను ఎంత ఘోరంగా కొనసాగిస్తూ వచ్చారంటే.. తెలుగుదేశం నాయకులు తమ సొంత డబ్బుతో,సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లను ప్రెవేటు స్థలాల్లో ప్రారంభించి నిర్వహిస్తున్నా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు, పోలీసుల మద్దతుతో వాటిని ప్రతిచోటా కూల్చివేయడం వరకు వచ్చాయి.
అక్కడినుంచి ఈ విద్వంసాలు కొనసాగుతూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కిచెందిన చిన్న సన్న ప్రతి నాయకుడు మీదకు ఇలాంటి దూకుడు కనబరిచారు. నిబంధనలను అతిక్రమించారని చిన్న చిన్న కారణాలు చూపించి.. వారి ఇండ్లు ఇతర నిర్మాణాలను వరుసపెట్టి కూలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో ఒక దశలో ఎలా తయారైనదంటే వీకెండ్ వచ్చి కోర్టుకు వెళ్లడానికి వీలులేకుండా సెలవు వస్తుందని అనిపిస్తే.. ఆ తెల్లవారుజామున రాష్ట్రంలో ఏదో ఒక మూల తెదేపా వారి ఆస్తుల కూల్చివేత ఉండేది. ఇలా విచ్చలవిడి విధ్వంసకాండ కొనసాగుతూ వచ్చింది.
పరిపాలన అంటే విధ్వంసం కాదని జగన్ తెలుసుకోవాలి. ఈ విద్వంసాన్ని ప్రజలు కూడా గుర్తిస్తే అది ఆయనకు ప్రమాదకరం అని, కేవలం సంక్షేమం అనే మాట కంటె.. ఇలాంటి ఆలోచనలను ప్రజలు అసహ్యించుకుంటారని జగన్ తెలుసుకోవాలి. విధ్వంసక సీఎం ముద్రను తొలగించుకోవాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles