జగన్ జవాబు చెప్పలేని సవాలు విసిరిన లోకేష్!

Sunday, December 22, 2024

ప్రత్యర్థి జవాబు చెప్పడానికి అవకాశం లేని ప్రశ్నను సంధించడం అనేది.. రాజకీయాల్లో తొలి విజయం. ప్రత్యేకించి పెద్దపెద్ద నిందలు వేయక్కర్లేదు. గొంతు చించుకుని అరవాల్సిన అవసరం కూడా లేదు. ఏ ప్రశ్న వేస్తే.. దానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రత్యర్థి తడబడతాడో, ఏ సమాధానం చెబితే ఎంతగా ఇరుక్కు పోతానో అని కంగారు పడతాడో.. అలాంటి ప్రశ్నలను సంధించడం ఒక వ్యూహం. 61 రోజులుగా పాదయాత్ర చేస్తూన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ మీద ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని ఆయన హామీ ఇస్తున్నారు.

యువతరం, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, పరిశ్రమలు-ఉద్యోగ అవకాశాలు లాంటి ఏ టాపిక్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. అదే సమయంలో ప్రభుత్వ పథకాలు, వివిధ ప్రాజెక్టులు, వాటి నిర్మాణంలో జాప్యం, జరుగుతున్న అవినీతి లాంటి ఏ విషయాన్ని ప్రస్తావించినా సరే… అధికార పార్టీకి చెందిన నాయకులు గుంపులు గుంపులుగా మైకుల ముందుకు వచ్చి ప్రతి విమర్శలతో విరుచుకుపడతారు. వారి సమాధానాలలో సహేతుకత ఉన్నదా లేదా అనే సంగతి వేరే విషయం. అన్ని అంశాలలోనూ ఏదో ఒక కౌంటర్ వారి వైపు నుంచి వచ్చేస్తుంది. అదే ఉద్యోగాల కల్పన ఉపాధి అవకాశాలు లాంటి టాపిక్ వస్తే అధికార పార్టీ తరఫునుంచి నిశ్శబ్దం తాండవిస్తుంది. ఇదే నారా లోకేష్ కు అడ్వాంటేజీ అవుతోంది. ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మాట తప్పేది ఉండదని నారా లోకేష్ పాదయాత్రలో అంటున్నారు.

పనిలో పనిగా యువతరానికి ఉద్యోగావకాశాలు కల్పనకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలు అన్నింటినీ గుర్తు చేస్తున్నారు. ప్రతి ఏటా 2.3 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు కల్పిస్తానని వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ పూర్తిగా మాట తప్పిన వైనం నారా లోకేష్ కు బ్రహ్మాస్త్రం అవుతోంది. అసలే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఎదురైన భంగపాటు.. ఆ వర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత పేరుకుపోయి ఉన్నదో చాలా స్పష్టంగా నిరూపించింది. అదే యువతరాన్ని ఇప్పుడు నారా లోకేష్ మరింతగా టార్గెట్ చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన పరిశ్రమల వద్ద, ఆయా పరిశ్రమల్లో ఉద్యోగాలు చేయడానికి వెళుతున్న యువతరంతో కలిసి బస్సులో దిగిన సెల్ఫీలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ నారాలోకి నారా లోకేష్ ఒక చర్చ లేవనెత్తారు. ఆయన చేసిన పని చాలా చిన్నదే గాని దాని ప్రభావం చాలా పెద్దది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పలేనటువంటిది సెల్ఫీలకే ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ లేదు. అలాంటిది- ఏటా 2.3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి పాచిపోయిన హామీ గురించి ప్రస్తావిస్తే.. జవాబు ఎక్కడ ఉంటుంది? అందుకే దానినే అడ్వాంటేజ్ గా మార్చుకుంటూ పాదయాత్రలో ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles