జగన్.. ‘గుడికి వెళ్లరు.. వెళ్లనివ్వరు!’

Wednesday, December 18, 2024

చంద్రబాబునాయుడు పాలనలో ఆయన పేరు మీద ఒక పాపులర్ నినాదం చెలామణీలో ఉండేది. చంద్రబాబు అనేమాటలుగా ’నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనేదే ఆ నినాదం. చంద్రబాబునాయుడు అధికారులను పరుగులు పెట్టించి మరీ వారితో పనులు చేయిస్తారని, ఏమాత్రం రాజీ పడకుండా కరాఖండీగా ఉంటారని, తాను కూడా పనిరాక్షసుడిలాగా నిరంతరం అధికార్లను ఫాలో అప్ చేసే సమావేశాలతో వారిని తొందరపెడుతుంటారని ఈ నినాదం తెలియజెప్పేది.
అయితే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో ఒక సరికొత్త నినాదాన్ని డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది. ‘నేను గుడికి వెళ్లను.. మిమ్మల్ని వెళ్లనివ్వను’ అని ఆయన పంతం పట్టినట్టుగా ఆయన వ్యవహార సరళి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ప్రభావశీలమైన తెలుగుదేశం పార్టీ నాయకులు జీసే సోదరులు తమ ఇంటిదైవం అయిన రంగనాథస్వామి ఉత్సవాలకు వెళ్తోంటే కూడా.. పోలీసులు వారిని అడ్డుకుని, ఆంక్షలు విధించి పూర్తిగా గృహనిర్బంధం చేయడం చాలా విమర్శలకు దారితీస్తోంది.
అనంతపురం జిల్లాలో ఆలూరుకోన రంగనాథస్వామి ఆలయానికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రథోత్సవానికి వెళ్లడానికి జేసీ సోదరులు బయల్దేరారు. అయితే అదే సమయానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ ఉత్సవాలకు వెళుతున్నారని తెలిసి, పోలీసులు వీరిని ఇంటివద్దనే అడ్డుకున్నారు. ‘మా ఇంటి దైవం.. వెళ్లడానికి అనుమతించండి’ అంటూ జేసీ ప్రభాకరరెడ్డి తగాదాపడినా కూడా పోలీసులు వారిని విడిచిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆంక్షలు, నిర్బంధాలు ఎంత స్థాయికి దిగజారుతున్నాయంటే.. ఉద్యమాలు, పోరాటాలు చేస్తోంటే నిర్బంధించడం సహజం అయిపోయింది. చివరికి గుడికి వెళ్లాలంటే కూడా నిర్బంధించడం తాజా డెవలప్మెంట్ గా ఉంది.
జగన్మోహన్ రెడ్డిలో దైవభక్తి మెండుగానే ఉన్నట్టు కనిపిస్తారు. స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్.. బొట్టు పెట్టుకుని హిందూ ఆలయాల్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పట్టుపంచెలతో, పైపంచె జారిపోకుండా పిన్ను పెట్టుకుని మరీ చాలా పద్ధతిగా వెళుతుంటారు. అాలాంటి జగన్.. ఏపీ భద్రాచలంగా కీర్తి పొందుతున్న ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వయంగా వెళ్లి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే మహదవకాశం వస్తే వెళ్లలేదు. కాలు బెణికింది.. అనే మాట చెప్పి ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లకుండా కార్యక్రమం రద్దు చేసుకున్నారు. రాముడి సేవలో పాల్గొనడం ఆయనకు ఇష్టం లేదని కిట్టినవాళ్లు ప్రచారం చేశారు కూడా.
ఇప్పుడు జేసీ సోదరుల నిర్బంధం చూస్తోంటే.. జగన్ తాను గుడికి వెళ్లడు.. ప్రతిపక్షాల వారిని వెళ్లనివ్వడు.. అని జనం అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles