జగన్ తో విభేదించి.. కనీసం ఏడాదికోసారి రాఖీ కట్టే సాంప్రదాయాన్ని కూడా మానుకున్న తరువాత.. రాజకీయంగా తన సొంత అస్తిత్వం, వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వ వైభవం చూపించుకోవాలని షర్మిల తెలంగాణ రాజకీయాల్లో పోరాడుతున్నారు. తాజాగా ఆమె మాటలు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఇవి కేవలం రాజకీయాలకు సంబంధించినవి మాత్రమే కాదు.. నేరమయ సామ్రజ్యానితో లింకులను బయటపెట్టేవి.
జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎట్టకేలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించే దాకా వచ్చింది. నిజానికి తన తమ్ముడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని జగన్ తొలినుంచి ఈ కేసులో ఇరుక్కోకుండా కాపాడుతూ వస్తున్నాడని అనేక ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులైతే.. ఏకంగా ఈ హత్య వెనుక జగన్ మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నదని ఆరోపణలు చేస్తుంటారు. తమ్ముడు అవినాష్ రెడ్డిని బాబాయి హత్య కేసు నుంచి తప్పించడానికే.. జగన్ పదేపదే ఢిల్లీ వెళుతూ.. కేంద్రంలోని బిజెపి పెద్దల వద్ద మోకరిల్లుతున్నారని కూడా తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తుంటారు. కడపలో విచారణ సాగించినంత కాలం.. హత్యవెనుక ప్రధాన కీలకనిందితుడిగా ప్రచారంలో ఉన్న అవినాష్ రెడ్డిని కనీసం టచ్ కూడా చేయలేకపోయిన సీబీఐ అధికారులు, విచారణ పర్వం హైదరాబాదుకు మారిన తర్వాత ఆయనకు నోటీసులు ఇచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో.. తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణ నిష్పాక్షికంగా జరగాలని, దోషులను పట్టుకోవాలని వైఎస్ షర్మిల ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ డిమాండ్ చేయడం కీలకంగా భావించాలి. హత్య జరిగి సంవత్సరాలు గడిచాయి, పేరున్న వ్యక్తికే ఈ గతి పడితే.. ప్రజలకు సీబీఐపై నమ్మకం ఉంటుందా అని కూడా షర్మిల నిలదీశారు. దోషులను వెంటనే శిక్షించాలని వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోరుతోంది.. అని ఆమె ప్రకటించారు. ఈ మాట ద్వారా.. ఆమె జగన్ ను ఇరుకున పెట్టినట్టే కనిపిస్తోంది. హత్యవెనుక సూత్రధారిగా ప్రచారంలో ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని అసలే జగన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
తనకు గానీ, వైఎస్సార్ కుటుంబానికి చెందిన విజయమ్మ, షర్మిలలో ఒకరికి గానీ కడప ఎంపీ టికెట్ ఇవ్వాలని పట్టుపట్టినందుకే వివేకాను హత్య చేశారనే ప్రచారం ఉంది. దానికి తగ్గట్టు హత్య కేసు నిందితులను పట్టుకోవాలని వైఎస్ఆర్ కుటుంబం తరఫున షర్మిల చేస్తున్న డిమాండ్.. సంచలనం కలిగిస్తోంది. ఈ కేసుకు జగన్ కు చుట్టుకోకుండా ఉంటుందా అని పలువురు అనుమానిస్తున్నారు.
ఇలాంటి వాటిపై ప్రభుత్వ ఒత్తిడి ఉండకూదని కోరుకుంటున్నానని అనడం ద్వారా షర్మిల, విచారణపై జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉంటున్నదా? అనే సందేహాలను మరింతగా రేపినట్లు అయింది.
చెల్లెమ్మ డిమాండ్‌లు జగన్‌కు ఇరకాటమే!
Monday, December 23, 2024