అసెంబ్లీ ఎన్నికలు మరి కొన్ని నెలల్లో ముంచుకువస్తున్న వేళ.. గులాబీ దళపతి కేసీఆర్ ఒక గొప్ప వరాన్ని తెలంగాణ ప్రజలకు అందించారు. విద్యుత్తు సంస్కరణలు, విద్యుత్తు బిల్లుల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. కేంద్రానికి కొరుకుడు పడకుండా ముందుకు వెళుతున్న కేసీఆర్ సర్కారు తాాజాగా డిస్కంలు ప్రజలనుంచి వసూలు చేయడానికి సిద్ధపడిన 12718 కోట్ల రూపాయలను ప్రభుత్వమే సొంతంగా చెల్లించడానికి నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రప్రజలపై భారం తగ్గుతుంది. ట్రూఅప్ చార్జీల పేరిట డిస్కంలు ఎప్పటికప్పుడు ప్రజల నడ్డి విరిచేలా పెంచే చార్జీల బారినుంచి కాపాడినట్టు లెక్క. ఇది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే చాలాపెద్ద తాయిలం అనే చెప్పాలి. ఇలా ప్రజల్లో మంచి పేరు తెచ్చి పెట్టే నిర్ణయాన్ని ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారు ఫాలో కాగలదా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఏపీ– తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఇంచుమించుగా ఒకే తరహాలో పరిపాలన సాగిస్తున్నాయి. ఒకరు తీసుకునే మంచి నిర్ణయాలను మరొకరు చాలా సందర్భాల్లో ఫాలో అవుతున్నారు. అలాంటిది ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల విషయంలో ఏపీ కూడా తెలంగాణ సర్కారును అనుసరిస్తుందా అనే అనుమానం కలుగుతోంది. అసలే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నట్టుగా ఇటీవలి ఎన్నికల ఫలితాలతో బోల్తాపడిన వైసీపీ సర్కారు, ఇలాంటి నిర్ణయాలు తీసుకుని తమ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.ు
కేంద్రం సూచించే విధివిధానాలను ధిక్కరిస్తూ తెలంగాణ కేసీఆర్ విద్యుత్తురంగంలో తనదైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో ఏపీ సర్కారు కేంద్రం ఒత్తిడికిక తలొగ్గుతోంది. వ్యవసాయ రంగానికి ఉచితంగా అందించే విద్యుత్తుకు మీటర్లు పెట్టాలని ఏపీ రైతెుల వెంటపడుతోంది. అదే సమయంలో అసలు మీటర్లు బిగించే సమస్యే లేదని కేసీఆర్ తేల్చేశారు. తాజాగా వ్యవసాయ రంగానికి ఎంత సరఫరా అవుతోందో తెలుసుకోవడానికి ట్రాన్స్ ఫార్మర్ల వద్ద మీటర్లు పెడతాం అని అధికారులు ప్రకటించారు. దీనివలన లెక్క తెలుస్తుంది గానీ.. తమకు భారం వడ్డిస్తారనే భయం రైతులకు ఉండదు. కానీ జగన్ సర్కారు అలా చేయడం లేదు.
అసలే ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత.. విద్యుత్తు చార్జీలను అనేక రకాలుగా పెంచిన వ్యక్తిగా జగన్ ముద్రపడ్డారు. రకరకాల దొంగమార్గాల్లో ప్రజల నడ్డి విరుస్తున్నారు. కనీసం తెలంగాణ మార్గంలో ట్రూఅప్ చార్జీల భారం ప్రజలపై వేయకుండా నిర్ణయమేదైనా తీసుకుంటే ప్రభుత్వానికి కాన్త మంచిపేరు రావొచ్చు. కానీ తాను చేస్తున్న సంక్షేమ పథకాలు తప్ప మరో పనిచేయడానికి ఇష్టపడని జగన్ ఏం చేస్తారో చూడాలి.