కేసు దాకా వచ్చేసరికి అబద్ధాల కారుకూతలు!

Monday, December 23, 2024

చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంలో రేగిన అల్లర్లు సంచలనం సృష్టించాయి. చంద్రబాబునాయుడు వెళుతుండగా.. అంగళ్లు వద్ద గొడవలు జరిగాయి. దీనికి సంబంధించి.. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నాయకులు వేసిన కేసుల మీద కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కోర్టు ఆశ్చర్యం మాత్రమే కాదు.. వైసీపీ వారి ఫిర్యాదును గమనిస్తే.. మరీ అంత చవకబారుగా సాకులు చెబుతున్నారా? అనికూడా అనిపిస్తుంది. చంద్రబాబునాయుడుకు వినతిపత్రం ఇచ్చేందుకు అంగళ్లుకు వెళ్లాం, అక్కడ నిరసన దీక్షకు పూనుకున్నాం అంటూ వైసీపీ నాయకులు చెప్పడం కామెడీగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కోర్టు ప్రశ్నించింది కూడా ఇదే. ఫిర్యాదు చేసిన వాళ్లు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు అంగళ్లుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అంటూ వారు ప్రశ్నించారు. మీ చర్య రెచ్చగొట్టడం కాదా అని కూడా ప్రశ్నించడం విశేషం. కోర్టు ప్రశ్నతో ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెత చందంగా.. అంగళ్లుదాకా పని గట్టుకుని వెళ్లి చంద్రబాబును, తెలుగుదేశం నాయకులను కవ్వించి, రెచ్చగొట్టి ఘర్షణలకు, అల్లర్లకు కారణమైన వైసీపీ నాయకులు.. తిరిగి తామే వారి మీద ఎదురు పోలీసుకేసులు నమోదు చేయడం చిత్రంగా కనిపిస్తోంది. పైగా ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఈ కేసులు నమోదు చేయడం కూడా.. కోర్టు విచారణ సందర్భంగా ప్రస్తావనార్హం అవుతోంది. ఫిర్యాదు చేసిన వారికి కనీసం గాయాలు కూడా లేకపోగా హత్యాయత్నం కేసులు పెట్టడం చాల్రబైన పరాణీబవ.
అంగళ్లు వద్ద చంద్రబాబునాయుడు కాన్వాయ్ వెళుతుండగా.. వైసీపీ నాయకులు వచ్చి రెచ్చగొట్టడం.. ఇరు పార్టీల మధ్య ఘర్షణలు జరగడం పాఠకులకు తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం దాదాపు ఏకపక్షంగా తెలుగుదేశం నాయకులపైనే కేసులుపెట్టారు. తెదేపా రాళ్లదాడుల్లో పోలీసులు గాయపడ్డారనేది వారి ప్రధాన ఆరోపణ. ఈ అల్లర్లకు చంద్రబాబునాయుడు ప్రధాన కారకుడు అన్నట్టుగా, ఆయనను ఏ1గా చేర్చారు. హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కావడంతో ఇప్పుడు ఈ కేసులపై బహుధా చర్చనీయాంశం అవుతోంది. న్యాయస్థానం ఎదుట ఈ వివాదం ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles