కాపుల రచ్చలో చంద్రబాబును ఇరికిస్తున్న కమ్మనేత!

Wednesday, December 18, 2024

సాధారణంగా రాజకీయనాయకులకు ఒక టెక్నిక్ ఉంటుంది. తమ రాజకీయ ప్రత్యర్థుల్లో ఎవరైనా ఒక నాయకుడిని అత్యంత దారుణంగా తిట్టించాలని అనుకుంటే గనుక,  ఆ నాయకుడి కులానికే చెందిన వారిని తమ పార్టీనుంచి ఎంపిక చేసుకుంటారు. ఆ ప్రత్యర్థిని తిట్టే డ్యూటీ వారికి అప్పగిస్తారు. అలా అలా ఆ కులంవాళ్లే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండాలనే కుట్రకోణం ఇందులో ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో ఇంకో టెక్నిక్ ఆయన అనుసరించేవారు. అగ్రకులాలకు చెందిన సెలబ్రిటీ ప్రత్యర్థులను తిట్టించాలనుకుంటే.. తమ పార్టీ నుంచి ఎస్సీ ఎస్టీ నాయకులకు ఆ బాధ్యత పురమాయించే వారు. సదరు ఎస్సీ నాయకులు ఎడాపెడా తిట్టేస్తారు. తమ రాజకీయ ప్రత్యర్థి వారికి కౌంటర్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతారు. అంతటితో అది సమసిపోతుంది. ఆ రకంగా.. జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త టెక్నిక్ ను కనిపెట్టారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా.. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని దూషిస్తే, దానికి ముద్రగడ కాస్త అతిగా స్పందించడం వలన.. కొన్ని రోజులుగా కాపుల్లోని రెండు వర్గాల మధ్య విమర్శలు తీవ్రస్థాయిలో నడుస్తున్నాయి. కాపులు- కాపులు మాటల దాడులతో నిత్యం కొట్టుకుంటున్నారు.

సరిగ్గా ఇక్కడే జగన్ కోటరీ మాస్టర్ ప్లాన్ పనిచేసింది. ఈ కాపుల రచ్చలోకి, అనూహ్యంగా చంద్రబాబునాయుడును లాక్కువచ్చే ప్రయత్నం చేశారు. ఆ పనిని కూడా ఓ కమ్మనేతతోనే చేయించడం విశేషం. గతంలో తెలుగుదేశం పార్టీతో మంచి అనుబంధాన్నే కొనసాగించిన సినీరచయిత పోసాని కృష్ణమురళి.. కాలక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పంచన చేరారు. దూకుడుగా మాట్లాడే అలవాటున్న పోసాని , పవన్ కల్యాణ్ మీద కూడా తీవ్రమైన విమర్శలు చేసి గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. ఆ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిని జగన్ సర్కారు ఆదరించి.. ఆయనకు ఎఫ్‌డీసీ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. పదవి దక్కింది గానీ.. అప్పటినుంచి ఆయనకు జగన్ పట్ల రుణం తీర్చుకోవడానికి సరైన అవకాశం దొరికినట్టు లేదు. అందుకే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయారు.

ఒకవైపు పవన్ కల్యాణ్ ను తిట్టకుండా ఆచితూచి మాట్లాడుతూ (గతంలో పవన్ ను తిడితే ఎలా ఉంటుందో ఆయనకు స్వానుభవం గనుక) కాపుల మధ్య చిచ్చు పెట్టిన తెలివితేటలు చంద్రబాబునాయుడువని అంటూ.. మధ్యలోకి ఆయన్ను లాక్కొచ్చారు. చంద్రబాబు చాలా పెద్ద స్కెచ్ వేసి కాపుల మధ్య తగాదా పెట్టారని వైసీపీలోని ఈ కమ్మనేత రంగు పులుముతున్నారు. ఇక్కడ పోసాని అజ్ఞానంతో మాట్లాడుతున్న సంగతి ఒకటుంది. ఇప్పుడు కాపుల్లోని వర్గాల మధ్య చాలా పెద్ద రచ్చ జరుగుతున్న సంగతి నిజమే. కానీ.. ద్వారంపూడి మీద పవన్ విమర్శలకు మధ్యలో తగుదునమ్మా అంటూ తలదూర్చి ముద్రగడ పద్మనాభం లేఖ రాయకుండా ఉంటే ఈ రచ్చ ఉండేదే కాదు. ముద్రగడ వైసీపీ లబ్ధిని ఆశించి మాట్లాడుతున్నారు గనుక.. పోసాని ఆయనను లెజెండ్ అంటూ కీర్తించవచ్చు గాక! కానీ.. చంద్రబాబునాయుడుకు ఈ రచ్చను పులమడానికి ప్రయత్నించడం మాత్రం చాలా హేయంగా ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles