కత్తిపూడిలో జనసైనికుడికి ప్రమాదం : పోలీసులు ఏం చేస్తున్నట్టు?

Saturday, January 18, 2025

వారాహియాత్రను ప్రారంభిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ తన తొలి బహిరంగ సభను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో నిర్వహిస్తున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం తర్వాత.. అన్నవరం నుంచి పవన్ కల్యాణ్ కత్తిపూడికి బయల్దేరారు. సాయంత్రం జరగాల్సి ఉన్న బహిరంగ సభకోసం అప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తయి ఉన్నాయి. ఈలోగా ఒక ఉపద్రవం జరిగింది. తన అభిమాన నాయకుడిని బాగా చూడాలనే ఉద్దేశంతో ఫోకస్ లైట్లు ఏర్పాటుచేసిన స్టాండ్ మీదకు ఎక్కిన ఒక జనసైనికుడు కరెంటు షాక్ కు గురయ్యాడు. ట్రాన్స్ ఫార్మర్ పై పడి గాయపడ్డాడు. అతను షాక్ కు గురైన సంగతి చూసిన ఇతర కార్యకర్తలు జాగ్రత్తగా ఆ స్టాండ్ ఎక్కి.. కర్ర సాయంతో అతడిని కాపాడారు. అయితే ఇక్కడ ప్రజలకు ఒక సందేహం తలెత్తుతోంది. పవన్ కల్యాణ్ సభ అంటేనే అనూహ్యంగా జనం పెద్దసంఖ్యలో వస్తారని అందరికీ తెలుసు. మరి సభలకు అనుమతులు కూడా ఇచ్చిన పోలీసులు అక్కడ భద్రత ఏర్పాట్ల విషయంలో ఏం చేస్తున్నారు?

పవన్ కల్యాణ్ సభకు, వారాహి యాత్రకు అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసులు ఎంతగా సతాయించారో అందరికీ తెలుసు. యాత్ర మొదలయ్యే 24 గంటల ముందు వరకు కూడా పోలీసు అనుమతులు ఉంటాయో లేదో తెలియనిస్థితిలో పార్టీని డోలాయమాన స్థితిలో పెట్టారు. పోలీసుల మీద అనుమానంతో వారు ఒకవైపు అనుమతులకోసం కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా కల్పించారు. కార్యక్రమం వివరాలు మొత్తం ఇచ్చినప్పటికీ.. పదిరోజులపాటూ మినిట్ టూ మినిట్ షెడ్యూలు ఇస్తే తప్ప అనుమతులు ఇవ్వబోమంటూ భీష్మించుకున్నారు. పార్టీ ఆ వివరాలు కూడా ఇచ్చిన తర్వాత.. అనుమతులు వచ్చాయి.

పోలీసులు అనుమతులు ఇవ్వడం అంటే ఏమిటి? పవన్ ను రోడ్డు మీద వెళ్లడానికి, సభ పెట్టుకోడానికి ఓకే చెప్పి చేతులు దులుపుకోవడం కాదు కదా.  ఆ సభా వేదిక వద్ద, యాత్ర జరుగుతున్న మార్గాల్లో భద్రత ఏర్పాట్లు మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత వారిదే కద? అనేది ప్రజల సందేహం. కత్తిపూడి సభా వేదిక వద్ద పోలీసు భద్రత సక్రమంగా ఉన్నట్లయితే గనుక.. ఈ ప్రమాదం జరిగేదే కాదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. లైట్ స్టాండ్ లు చాలా ఏమీ ఉండవు. అలాంటప్పుడు కుర్రాళ్లు వాటిని ఎక్కే ప్రమాదం ఎటూ ఉంటుంది కాబట్టి.. సభకు భద్రత కోసం వచ్చే పోలీసులలో ప్రతిలైటు స్టాండు వద్ద ఒకరిద్దరిని నియమించి ఉంటే.. అసలు ఏ ఒక్కరూ ఎక్కే పరిస్థితే ఏర్పడదు. ఇలాంటివి నియంత్రించడానికే పోలీసులు కావాలి. మరి అలాంటప్పుడు పోలీసులు కత్తిపూడి సభ వద్ద ఏం చేస్తున్నట్టు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles