కందుకూరు చావులపై వైసీపీ చెత్త మాటలు!

Thursday, December 19, 2024

చంద్రబాబునాయుడు సభలో పాల్గొనే ఉత్సాహంతో సభకు వచ్చి, అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా 8 మంది అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు కన్నుమూయడం అనేది చాలా విషాదభరితమైన సంఘటన. కనీస ప్రోటోకాల్ మర్యాదలు కూడా లేకుండా.. చంద్రబాబు సభల నిర్వహణ, భద్రత బాధ్యతలను పోలీసులు గాలికి వదిలేయడం వల్ల మాత్రమే చోటు చేసుకున్న విషాదం ఇది. కందుకూరు విషాదం చోటు చేసుకున్న వెంటనే.. ఆ మరురోజు కావలిలో జరిగే సభకు పెద్దసంఖ్యలో బలగాలతో భద్రత ఏర్పాటుచేసిన పోలీసులు..కందుకూరులో ఎందుకు చేయలేకపోయారు? కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. చంద్రబాబు సభల పట్ల పోలీసులు తొలినుంచి నిర్లక్ష్యంగానే ఉన్నారు. వాళ్లు పద్ధతిగానే ఏర్పాట్లు చేస్తూ ఉంటే గనుక.. గతంలో ఆయన మీదకు రాళ్లు విసరడం లాంటి ఘటనలుజరిగేవి కాదు.
ఆ సంగతి పక్కన పెడితే.. పోలీసు వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న మరణాలను చంద్రబాబు మీదకు నెట్టేయడానికి, చావులతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రజలను నమ్మించడానికి ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నానా పాట్లు పడుతున్నారు. వారి లేకి మాటలు వింటోంటే అసహ్యం పుడుతోంది. పోలీసులు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సభ పెట్టుకోడానికి అనుమతిస్తే అక్కడ జనం లేరని చంద్రబాబునాయుడు తన కాన్వాయ్ ను అప్పటికప్పుడు డ్రైవరుకు ఆదేశించి మరీ ముందుకు తీసుకువెళ్లారట. అందువల్ల తొక్కిసలాట జరిగిందట. అదే సమయంలో చంద్రబాబు సభకోసం ఫ్లెక్సిలు స్పీకర్లు ఏర్పాటు చేయడం వలన వంద అడుగుల రోడ్డు కాస్తా 30 అడుగులకు కుంచించుకుపోయిందని వైసీపీ దళాలు కారుకూతలు కూస్తున్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చిన చోటులో కాకుండా, చంద్రబాబు ముందుకు వెళ్లిపోవడమే గనుక నిజమైతే ఆ ప్లేసులో అప్పటికప్పుడు ఫ్లెక్సిలు, స్పీకర్లు ఎలా వచ్చాయి..? పోలీసులు చంద్రబాబు సభను పట్టించుకోలేదు. జనం అంత అనూహ్యంగా వస్తారని కూడా అనుకోలేదు. భద్రత ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి డ్రోన్ కెమెరా షూటింగులతో ఎక్కువమంది జనం ఉన్నట్టుగా చెప్పుకోడానికి తెలుగుదేశం ఆరాటపడడం వల్ల దుర్ఘటన జరిగిందంటున్నారు. చంద్రబాబు మీదనే నెపం నెట్టే ప్రయత్నం ఇది. చంద్రబాబు సభలకు ముందు ముందు అనుమతులు ఇచ్చేప్పుడు పోలీసులు ఆలోచించాలని, పెద్ద మైదానాల్లో పెట్టుకునేలా చూడాలని.. సకలశాఖల మంత్రిగా అభివర్ణించే సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇస్తున్నారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వలన దుర్ఘటన జరిగిందన్నట్టుగా నీచమైన వ్యాఖ్యలుచేస్తున్నారు.
ఒకచోట అనుమతులు తీసుకుని మరొకచోట మీటింగు పెడితే.. ఏపీ పోలీసులు వదిలిపెడతారా? ఇవన్నీ కేవలం తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి బూటకపు మాటలు అని జనం అనుకుంటున్నారు. ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోడీ స్పందించి ఎక్స్ గ్రేషియా ప్రకటించే వరకు కనీసం సంతాపం కూడా వెలిబుచ్చని కఠినాత్ముడైన ముఖ్యమంత్రి ఆ తర్వాత తాను కూడా పరిహారం ఇచ్చారని, కానీ.. బాధ్యతారహితంగా తమ పార్టీ నాయకులతో మాట్లాడిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles