ఎవరూ మెట్టు దిగలేదు గనుకనే.. ఇలా!

Sunday, December 22, 2024

మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఓడించడానికి వామపక్షాల బలాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ వాడుకుంది! ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో వామపక్షాలకు- గులాబీ దళానికి మధ్య పొత్తు కేవలం మునుగోడు ఉపఎన్నికకు మాత్రమే పరిమితం కాదని, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఆ నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీల మధ్య పొత్తు ఉంటుందని, ఆయన తమకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తారని ఇంతకాలమూ వామపక్ష పార్టీలు ఎదురు చూశాయి. కానీ కేసీఆర్ తమ పార్టీ ఎన్నికల జాబితాను ప్రకటించేశారు. అందులో వామపక్షాలు కోరుకున్న స్థానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘పొత్తు అనేది కల్ల’ అని తేలిపోయింది. వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం రెండూ కలిసి ఉమ్మడిగా తమ భవిష్య కార్యాచరణను నిర్ణయించుకోవడానికి భేటీ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో కేసీఆర్ మాట ఇచ్చిన పొత్తు అనేది ఇంత పేలవంగా తేలిపోయిందా అనే అనుమానం ప్రజలకు కలగడం సహజం. అయితే పొత్తు విషయంలో కెసిఆర్ పట్టించుకోలేదనడం సరికాదని, ఈ పార్టీల మధ్య జరిగిన సీట్ల సర్దుబాటు చర్చలలో ఎవరికి వారు మెట్టు దిగకపోవడం వల్ల మాత్రమే, ప్రతిష్టంభన వల్ల మాత్రమే పొత్తు ఆలోచన బెడిసి కొట్టిందని తెలుస్తోంది.

భారాస- వామపక్షాల మధ్య కొన్ని రోజుల కిందట సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు జరిగాయి. సిపిఐ సిపిఎం పార్టీలు తమకు మూడేసి అసెంబ్లీ సీట్లు కావాలని ప్రతిపాదన పెట్టాయి. భారాస ప్రతినిధులు అందుకు తిరస్కరించి ఒక ఎమ్మెల్యే సీటు రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. కనీసం రెండు ఎమ్మెల్యే, రెండు ఎమ్మెల్సీ సీట్ల వంతెన కావాలని ఎర్ర పార్టీలు విన్నవించుకున్నాయి. భారాస మెట్టు దిగలేదు. అదే సమయంలో వారు కూడా తమ పట్టు సడలించలేదు. కేవలం ఒక్క సీటు కోసం పొత్తు పెట్టుకోవడం అంటే పార్టీ పరువు పోతుందని వారు భావించినట్లుగా కనిపిస్తోంది. దాని పర్యవసానంగా తెరాస జాబితా విడుదల అయిపోయింది.

ఇప్పుడు ఈ రెండు పార్టీలు జట్టుగా రంగంలోకి దిగాలని అనుకుంటున్నాయి. ఈ ఇద్దరూ ఉమ్మడిగా కాంగ్రెసుతో జట్టుకట్టి.. రెండేసి సీట్లు కావాలనే ప్రతిపాదనతో వారివద్దకు వెళ్తాయా? అనే మాట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అలా జరిగితే.. ఇం.డి.యా. అనేది కేవలం పార్లమెంటు ఎన్నకల్లో మాత్రమే కాకుండా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోకూడా రంగంలోకి దిగినట్టు అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles