ఇది ధర్మరాజు మార్క్ చీటింగ్ టెక్నిక్!

Wednesday, January 22, 2025

ఇంతకూ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు అబద్ధం చెప్పి తప్పు చేశాడా లేదా? ఆయన అబద్ధం చెప్పారని ఎవ్వరూ అనలేరు. అయితే.. ఆయన మోసం చేయాలేదని కూడా అనలేరు. కురుక్షేత్ర సంగ్రామం టాప్ గేర్ లో జరుగుతున్న సమయంలో కౌరవుల వైపు నుంచి సేనాని ద్రోణుడు రెచ్చిపోతున్నాడు. ఆయనను నిలువరించడం ఎవ్వరికీ సాధ్యమయ్యేలా లేదు. అలాంటి సమయంలో అందరూ కలిసి ఓ పన్నాగం పన్నారు. అక్కడే కౌరవుల పక్షాన యుద్ధంలో అశ్వత్థామ అనే పేరుగల ఒక ఏనుగు కూడా ఉంది. వారి ప్లాన్ ఏంటంటే.. భీముడు ఆ ఏనుగును చంపాలి. ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని అరవాలి.. ద్రోణుడికి వినపడాలి.. అనేది! అలాగే జరిగింది. ధర్మరాజు అన్నాడు. యుద్ధం చేస్తున్న ఆవేశంలో ఆ మాట వేరెవరైనా అని ఉంటే ద్రోణుడు నమ్మేవాడూ కాదు.. పట్టించుకునేవాడూ కాదు. ధర్మరాజు నోట ఆ మాట వినపడగానే నమ్మి, తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడేమో అనుకుని.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈలోగా అర్జునుడి బావమరిది, ద్రోణుడిని చంపాలని కంకణం కట్టుకున్న ద్రుష్టద్యుమ్నుడు బాణాలు వేసి ఆ పని పూర్తి చేశాడు. ‘అశ్వత్థామ హతః’ అని గట్టిగా అరచిన ధర్మరాజు, ఆ వెనుక ‘కుంజరః’ అని చిన్నగా అరిచి, అబద్ధం చెప్పలేదని ఆత్మవంచన చేసుకున్నాడు. ఆ రకంగా నిజంలాంటి అబద్ధం చెప్పడం అనేది ధర్మరాజు మార్క్ మోసంగా ముద్రపడిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే పని చేస్తున్నారు.
ఇన్నాళ్లూ యూపీఏగా ఉన్న భాజపాయేతర పార్టీల విపక్ష కూటమికి కొత్త పేరు రాహులే పెట్టారని ఖర్గే చెప్పారు. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అనే పేరును ఆయనే సృష్టించారు. పొడిఅక్షరాల్లో అది ఇండియా అవుతుంది. నినాదాలకు చాలా బాగుంటుంది.. ‘ఇండియా జీతేగా మోడీ హారేగా’ అని అంటే.. బహుశా ఇండియా అంటే దేశం అనే భ్రమల్లో ఉండేవారికి చాలా హాయిగా ఉంటుంది. సరిగ్గా ఆ అంశాన్నే క్యాష్ చేసుకుని లబ్ధి పొందాలని రాహుల్ అండ్ కో అనుకుంటోంది. ఇండియా అనే పొడి అక్షరాల పేరు పెట్టుకుని .. భారత్ అనే భావనతో పోరాడే సత్తా ఎవరికీ లేదంటూ.. మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నారు. ఇండియాపై యుద్ధం జరిగితే విజయం ఎవరిదో అందరికీ తెలుసు… అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘ఇండియాపై యుద్ధం- ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు’ అంటూ ప్రజల వద్దకు వెళ్తారు. ఇండియాను వ్యతిరేకించే వారిని ఏం చేయాలి.. అంటూ ప్రజలను ప్రశ్నించి.. మోడీకి వ్యతిరేకంగా వారిని కూడగట్టగలమని వారు అనుకుంటున్నట్టున్నారు. ఇండియా ఇండియా అంటూ.. ఆ పదాల అర్థం భారత్ అనుకోవాలని విపక్ష కూటమి కోరుకోవడం ధర్మరాజు చెప్పిన ‘అశ్వత్థామ హతః కుంజరః’ వంటి నమ్మకమైన చీటింగ్ అనే సంగతి ప్రజలు గుర్తిస్తే గనుక.. యావత్ విపక్ష కూటమిని ఛీ కొడతారు. ఆ సంగతి రాహుల్ గుర్తించలేదేమో! చీటింగ్ టెక్నిక్ లేకుండా.. ప్రజల మనసులను గెలుచుకోలేమనం ఆయనకు అనిపించిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles