ఇది క్లియర్ :  ‘ముందస్తు’ లేదు గాక లేదు!

Wednesday, January 22, 2025

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే చాలా మంది ఊహలకు దాదాపుగా తెరపడినట్టే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, అధికారికంగా ప్రకటించకపోయినా.. వారు లీక్ చేస్తున్న కొన్ని అంశాలను పరిశీలించినప్పుడు మనకు ఈ విషయం స్పష్టం అవుతుంది. 2019 ఎన్నికలకు పూర్వం, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాగించిన పాదయాత్ర గురించి ‘యాత్ర 2’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమా పోస్టర్, టీజర్ ను తాజాగా విడుదల చేశారు. దానిని చూస్తే, ముందస్తు ఎన్నికలు రావడం లేదనే సంగతి మనకు అర్థమైపోతుంది.

2019 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర గురించి ‘యాత్ర’ చిత్రాన్ని రూపొందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వైసీపీకి బాగానే మైలేజీ లభించింది. ఆ చిత్రంలో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించారు. మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. సినిమా హిట్టయింది. పార్టీకి కూడా లాభం జరిగింది.

2024 ఎన్నికలకు వైసీపీ మరో బ్రహ్మాస్త్రంగా ఆ సినిమాకు సీక్వెల్ ను ప్లాన్ చేసింది. యాత్ర 2 పేరుతో వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర కథాంశంగా ఈ చిత్రం రూపొందుతోంది. మహి వి రాఘవనే దీనికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో ఎలా వ్యవహరించారనేది పాత సంగతి. అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన ప్రజల వద్దకు అసలు వెళ్లడం లేదు. జగన్ రోడ్డు మీద వస్తున్నారంటే.. ఏకంగా ఆ రోడ్డుపొడవునా దుకాణాలు మూయించేస్తూ.. జనసంచారం కూడా లేకుండా కట్టడి చేస్తూ, బారికేడ్లు కట్టేసి నానా బీభత్సాలు చేస్తున్నారు. ఈ రకంగా జగన్ విపరీతమైన అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అధికారంలో లేనప్పుడు చేసిన పాదయాత్ర  మీద సినిమా తీసి, ఆయన పడిన కష్టాలను హృద్యంగా చూపించగలిగితే.. ఆయన జనంతో బాగా కలిసిపోయే వ్యక్తి అని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే పార్టీకి లాభం ఉంటుందని వారి ఆలోచన.

అయితే  ఈ చిత్రాన్ని 2024 ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్టుగా పోస్టర్లలో ప్రకటించారు. అంటే సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు తెరమీదికి తెస్తారన్నమాట. ఖచ్చితంగా దీని ద్వారా పొలిటికల్ మైలేజీని ఆశించే చేస్తున్నారు. నాణేనికి రెండో వైపు గమనించినప్పుడు.. వచ్చే ఫిబ్రవరిలో ఈ చిత్రం వస్తున్నది అంటే.. దాని అర్థం..  ముందస్తు ఎన్నికలు రావడం లేదనే. షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ మే నెలల్లో ఎన్నికలు ఉంటాయనే అనుకోవాలి. ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారాలు ఎన్ని జరుగుతున్నా.. వైసీపీ వారు మాత్రం వాటిని ఖండిస్తూనే వచ్చారు. దానికి తగినట్టుగానే ‘యాత్ర 2’ తయారవుతున్నది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles