తెలుగులో జాంబీ జానర్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన సినిమా ‘జాంబీ రెడ్డి’. కరోనా సమయంలో విడుదలైన ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంతో, వినోదం కలిపి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో చూపించిన కొత్త కాన్సెప్ట్, సటైరికల్ ప్రెజెంటేషన్ అప్పట్లో మంచి చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఈ హిట్ మూవీకి కొనసాగింపుగా రెండో భాగం రాబోతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ మళ్లీ హీరో తేజ సజ్జాతో కలసి ఈ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అధికారికంగా సీక్వెల్‌ని అనౌన్స్ చేశారు కాబట్టి అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ముఖ్యంగా తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా క్రేజ్ సంపాదించుకున్నందున, ఈ సారి సినిమా స్థాయి కూడా భారీగా పెంచాలని మేకర్స్ ఆలోచన. జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారు. సరదా, వినోదం తగ్గకుండా ఉండేలా స్క్రీన్‌ప్లే తయారవుతుందని సమాచారం.
