టాలెంటెడ్ యంగ్ యాక్టర్ సత్యదేవ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా ‘జీబ్రా’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని దీపావళి కానుకగా విడుదలకు సిద్దంగా ఉంది. పూర్తి థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి. దీంతో దీపావళి బరిలో ఈ సినిమా కూడా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కొంతమేర ఆసక్తిని చూపించారు.
కానీ, ఇప్పుడు దీపావళి రేస్ నుండి ‘జీబ్రా’ మూవీ తప్పుకున్నట్లు సమాచారం. ఈమేరకు మేకర్స్ ఓ అధికారిక ప్రకటన చేశారు. కొన్ని కారణాల వల్ల తమ సినిమాను దీపావళి కానుకగా అందించలేకపోతున్నామని.. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
అయితే, ఈ సినిమాకు సరైన ప్రమోషన్స్ లేని కారణంగానే ఈ మూవీ విడుదల తేదిని వాయిదా వేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో ఓ మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో సత్యదేవ్‌తో పాటు ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్ పిచినెటో, డాలి ధనంజయ, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేస్తున్నారు.