టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆంధ్ర కింగ్ తాలూకాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కిస్తుండగా, కథానాయికగా భాగ్యశ్రీ బొర్సె నటిస్తోంది.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, తొలి పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు రెండో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడానికి టీమ్ సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 11.07 గంటలకు ఈ సాంగ్ ప్రకటన చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.
