అన్న కోసం రంగంలోకి తమ్ముడు!

Saturday, March 22, 2025

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పలు భారీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో వార్ 2, తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ కూడా ఒకటి. మరి ఈ రెండు సినిమాలపై కూడా భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకోపక్క తన అన్న నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. తాజాగా తాను చేసిన లేటెస్ట్ సినిమానే అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక ఈ సినిమాపై తాజా టీజర్ తో సాలిడ్ బజ్ ఏర్పడగా ఈమూవీని వేసవి రేస్ లోనే మేకర్స్ ఫిక్స్ చేశారు. అయితే కళ్యాణ్ రామ్ కోసం పలు సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు   తారక్ చాలా సందర్భాల్లో వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలా నెక్స్ట్ ఈ సినిమా ఈవెంట్ కి కూడా అన్న కోసం తారక్ వస్తాడని తెలుస్తుంది. ఈసారి ఈవెంట్ ని హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తుండగా ఇక్కడ ఎన్టీఆర్ ని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles