హైదరాబాద్ లో ల్యాండ్‌ అయిన యంగ్‌ టైగర్‌!

Monday, January 20, 2025

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌, గ్లోబల్‌ స్టార్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్ కోసం ముంబై లో ఉన్నారు. గత వారం రోజులుగా ఆయన ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా వార్‌ 2 సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్, హృతిక్‌ ల పై పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించింది సినిమా బృందం.

ఆ సినిమా కు సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించి ఎన్టీఆర్ హైదరాబాద్‌ కు చేరుకున్నారు. వార్‌ 2 సినిమాలో ఎన్టీఆర్‌ పాత్ర నెగిటివ్‌ షేడ్స్‌ తో కూడి ఎంతో పవర్ ఫుల్‌ గా ఉంటుందని సమాచారం.  ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ ఎంతో పత్రిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌ లో దేవర సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ రెండు సినిమాల గురించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles