టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకుంటున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజా వారు రాణి గారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిరణ్, తర్వాత ‘క’ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంటున్నాడు.
ఇదిలా ఉండగా, తన మొదటి సినిమా హీరోయిన్ అయిన రహస్య గోరఖ్‌తో ప్రేమలోపడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేసుకోకపోయినా, అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ మోమెంట్స్‌ను అభిమానులతో పంచుకుంటుంటారు.
ఇప్పుడు మరోసారి రహస్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ తాను త్వరలో తల్లి కాబోతున్న విషయంలో కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. కిరణ్‌తో కలిసి ఉన్న బ్యూటిఫుల్ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫుల్‌గా రియాక్ట్ అవుతున్నారు. వీరి పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఇక కిరణ్ ప్రస్తుతం ‘దిల్ రూబా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు వచ్చిన స్పందనతో అతడి కెరీర్ మరో మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ, ప్రొఫెషనల్ లైఫ్లోనూ కిరణ్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తోంది.
మీడియాలో ఈ హ్యాపీ న్యూస్ చక్కర్లు కొడుతుండగా, వీరి జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
