అమితాబ్‌ తో యంగ్‌ హీరో!

Tuesday, April 1, 2025

యంగ్ హీరో విక్రాంత్‌ మస్సే మెయిన్‌ రోల్‌ చేసిన మూవీ ‘12th ఫెయిల్‌’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే, అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ తాజా ఎపిసోడ్‌కు విక్రాంత్‌, మనోజ్‌ కుమార్‌లు హాజరై, ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

మొదట విక్రాంత్‌ మాట్లాడుతూ.. తాను ఎంతోకాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. మిమ్మల్ని (అమితాబ్‌ ని) తొలిసారి ఇదే మీట్ అవడం అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దానిపై అమితాబ్‌ స్పందిస్తూ.. ‘నాకు మాత్రం మనం ఇప్పటికే చాలా సార్లు కలుసుకున్నట్టు అనిపిస్తోంది. తెరపై మీ నటన చూసినప్పుడల్లా మీరు మా కుటుంబ సభ్యుడు అనిపిస్తుంది’ అని అమితాబ్ చెప్పుకొచ్చారు. తరువాత ‘12th ఫెయిల్‌’ సినిమా గురించి విక్రాంత్‌ స్పందిస్తూ.. ‘ఈ సినిమాకి సంబంధిత బుక్‌ని చదువుతంటే నాకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వ్యక్తిగతంగా ఆ స్టోరీ నాకు కనెక్ట్‌ అయింది. అనుకున్నట్టే సినిమా విజయం సాధించింది’ అని అన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles