మరో యాక్షన్‌ ప్రాజెక్టుని స్టార్ట్‌ చేసిన యంగ్‌ హీరో!

Sunday, December 22, 2024

మన టాలీవుడ్ లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాగ శౌర్య కూడా ఒకరు. లవ్ అండ్ యాక్షన్ సినిమాల్లో రాణించిన ఈ యంగ్ హీరో నటించిన లాస్ట్ చిత్రం “రంగబలి” అనుకున్న రేంజ్ లో హిట్‌ అవ్వలేదు. దీంతో శౌర్య  కొంచెం గ్యాప్ తీసుకొని మంచి కథలు వినడం మొదలు పెట్టాడు. అయితే ఆ రంగబలి సినిమా దర్శకుడు పవన్ బాసంశెట్టి తోనే చేస్తాడు అని కొన్ని రూమర్స్ వచ్చాయి.  కానీ ఇపుడు తన కొత్త సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఈసారి దర్శకుడు రమేష్ దేసినతో సినిమాని ప్రకటించగా.. ఈ మూవీ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్టుగా మూవీ మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ సినిమాని కొత్త నిర్మాణ సంస్థ వైష్ణవి ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా తమ బ్యానర్ నుంచి మొదటి ప్రొడక్షన్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందించనుండడం విశేషం.  నేడు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యిన ఈ చిత్రంపై మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles