మీరు దానిని ఎప్పటికీ కోల్పోకండి: సమంత!

Sunday, December 22, 2024

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో నటించి ఎన్నో సూపర్‌ హిట్లను తన కాతాలో వేసుకుంది. అయితే గత కొంతకాలంగా సామ్‌ కి సరైన సినిమా పడడం లేదు.  దీంతో సమంత  సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. తానే నిర్మాతగా మారి  “మా ఇంటి బంగారం” అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది.  అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మరికొన్ని రోజుల్లో వెల్లడించనున్నారు.

అలాగే సమంత గత ఏడాది హిందీలో నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో  స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ  ఏదోక పోస్ట్ పెడుతూ ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతుంది.

 ‘మీరు వృషభరాశిని ఎప్పటికీ కోల్పోకండి’ అంటూ ఓ కోటేషన్ ను  షేర్ చేసింది. సమంతది వృషభ రాశి కావడం విశేషం.వృషభం అంటే ఎప్పటికీ వెనకడుగు వేయని మనస్తత్వం.దీనితో ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles