పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ కథానాయిక గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “సలార్” తో ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ ఆకలి అంతా తీరిందని చెప్పుకొవచ్చు. ఆ సినిమాలో ఒక్కో యాక్షన్ బ్లాక్ కి సెపరేట్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఓటిటిలోకి వచ్చిన తర్వాత అయితే సలార్ కి రిపీట్ వ్యూస్ అయితే భారీ సంఖ్యలో వచ్చాయి అని చెప్పాలి. అందులోని కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అయితే ఒక వ్యసనంలా ఫ్యాన్స్ తో పాటు ఇతర ఆడియెన్స్ కూడా చూస్తున్నారు.
మరి మెన్ ఏదన్నా బాధలో ఉన్నపుడు నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి కాటేరమ్మ సీన్ చూసి హ్యాపీ అవుతారు అంటూ వచ్చిన ఓ మీమ్ కి హను మాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మద్దతు పలికాడు. అవును అది నిజమే మగవాళ్ళు సింపుల్ జీవులు అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. మరి ఈ మధ్య ప్రభాస్ కి రిలేటెడ్ పోస్ట్ లు ప్రశాంత్ వర్మ నుంచి చాలానే ఉంటున్నాయి.
ఆల్రెడీ ప్రభాస్ తో ఓ ఊహించని సినిమా తనతో ఉందని స్ట్రాంగ్ రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇలా మెల్లగా ఈ క్రేజీ కాంబో పై క్లారిటీ వస్తుందేమో చూడాల్సిందే మరి.