యష్‌ కోసం రంగంలోకి అనిరుధ్‌..!

Friday, December 5, 2025

కన్నడ రాకింగ్ స్టార్ యష్ “కేజీయఫ్”తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు నటుడిగానే కాకుండ నిర్మాతగా కూడా తన ప్రాజెక్ట్స్‌కి ఫుల్ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన నటిస్తున్న “టాక్సిక్” అనే సినిమా చుట్టూ ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంటోంది.

ఇటీవలే యష్ “రామాయణ” చిత్రంలో రావణుడిగా నటించనున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత, “టాక్సిక్” సినిమాపైనా ఆసక్తి మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇది పాటల విషయంలో కాదు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుద్ రవిచందర్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారన్న వార్తలు వినపడుతున్నాయి. సంగీతంలో తనదైన స్టైల్‌తో పాపులర్ అయిన అనిరుద్ ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కోసం మ్యూజిక్ కంపోజ్ చేస్తే, సినిమాకి ఎమోషనల్ డెఫ్త్ మరింత పెరుగుతుందని టాక్.

ఈ సినిమాను మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుండగా, హాలీవుడ్ స్థాయిలో వాసూలు చేసే విధంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. యష్ కెరీర్‌లో మరోసారి తన స్థాయిని చూపించేందుకు ఇది పెద్ద అవకాశం అని భావిస్తున్నారు అభిమానులు.

ఇప్పటికైతే మేకర్స్ నుంచి ఈ వార్తపై అధికారిక సమాచారం ఏమీ బయటకి రాలేదు కానీ, అనిరుద్ సంగీతంతో యష్ ప్యాన్ ఇండియా మార్కెట్‌లో మరోసారి సందడి చేయనున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles