అబ్బా ఏమి అందం.. హాలీవుడ్ రేంజ్‌!

Sunday, December 22, 2024

ఈ మధ్య కాలంలో హీరోయిన్లలో చాలా మంది సినిమాల కంటే కూడా ఎక్కువగా సోషల్‌ మీడియాలోనే ఉంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ కూడా మరోపక్క హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటారు. తాజాగా ఆ లిస్టులోకి యంగ్‌ హీరోయిన్‌ శోభిత ధూలిపాళ్ల కూడా వచ్చి చేరింది.

బాలీవుడ్‌ లో ఫుల్‌ బిజీగా ఉంటూ క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడూ తన తాజా చిత్రాలను పోస్ట్‌ చేస్తూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది.  తాజాగా ఆమె స్కిన్ టైట్ డ్రెస్సులోని ఫోటోలను  కొన్నిటిని సోషల్‌ మీడియాలో షేర్‌  చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల. ఆమె తాజాగా ‘మంకీ మ్యాన్’ చిత్రంతో హాలీవుడ్  లో కూడా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా ఈ నెల 26 న పాన్‌ ఇండియా లెవల్లో కూడా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో  శోభిత పాల్గొంది.  తాజాగా సోషల్ మీడియాలో స్కిన్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే  ఫోటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.. ఈ పిక్స్ చూసిన అభిమానులు, నెటిజన్స్ శోభిత అందం హాలీవుడ్ రేంజ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles