వాహ్వా సుందరి!

Friday, December 5, 2025

జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాన్ని క్యాష్ చేసుకోవడంలో కూడా విఫలమవడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాతో జాన్వీకి గ్రాండ్ ఎంట్రీ అయ్యింది. ఆ తర్వాత వెంటనే రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఇలా తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న జాన్వీ.. బాలీవుడ్‌లోనూ అదే స్పీడ్ చూపిస్తోంది. తాజాగా ఆమె, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరమ్ సుందరి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాపై క్రేజ్ పెంచేందుకు మేకర్స్ ప్రోమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాడాక్ ప్రొడక్షన్ కార్యాలయం ఎదుట జాన్వీ, సిద్ధార్థ్ జంటగా కనిపించారు.

పరమ్ సుందరి లుక్‌లో వీళ్లిద్దరూ కనిపించడంతో అక్కడికి వచ్చిన మీడియా వారంతా కెమెరాలతో ఫుల్ బిజీ అయిపోయారు. వీరి స్టైలిష్ లుక్స్, కెమిస్ట్రీ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఆ ఫోటోల్ని విపరీతంగా షేర్ చేస్తున్నారు. దీంతో ఆ పిక్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles