ఇది కూడా బాగుండి ఉంటేనా..?

Friday, December 5, 2025

పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిందీ చిత్రం. పవన్ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమాగా హైప్ కూడా పెరిగింది. ఎన్ని వాయిదాలు పడినా, ఎన్ని మార్పులు జరిగినా చివరికి విడుదలై థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. దీనిని చూస్తే పవన్ కల్యాణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

కానీ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందనల్లో కొన్ని మిశ్రమమైన కామెంట్లు వినిపించాయి. కథ, నటన, భారీ సెటప్పుల మీద కొన్ని పొజిటివ్ కామెంట్లు వచ్చాయి. అయితే ప్రేక్షకులందరూ ఒకే విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. అది వీఎఫ్ఎక్స్ భాగం. టీజర్, ట్రైలర్ స్థాయిలో అందంగా కనిపించిన గ్రాఫిక్స్, సినిమాలో మాత్రం అంత బాగా పండలేదని పలువురు చెబుతున్నారు. కొన్ని సీన్లు పూర్తిగా నాచురల్ లాగా అనిపించలేదని, గ్రాఫిక్స్ తక్కువ బడ్జెట్ టీవీ షోల లాగా కనిపించాయని కామెంట్లు వచ్చాయి.

మేకర్స్ ముందుగానే గ్రాఫిక్స్ మీద ఎంతగా కష్టపడుతున్నామని చెప్పారు. కానీ ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం అందరి అంచనాలను అందుకోలేకపోయింది. ఒకవేళ ఈ అంశాన్ని కూడా బాగానే మేనేజ్ చేసి ఉంటే, హరిహర వీరమల్లు మరింత భారీ స్థాయిలో నిలిచేదని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు.

ఇప్పటికీ ఫాన్స్ సపోర్ట్ సినిమాకి ఉంది కానీ, టెక్నికల్ క్వాలిటీ విషయంలో మరింత జాగ్రత్త తీసుంటే బాగుండేదన్న అభిప్రాయం విస్తృతంగా కనిపిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles