ఎన్టీఆర్ లేకుండానే..!

Wednesday, March 26, 2025

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా వచ్చే వారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తొలి షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారని.. మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్‌ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles