ఆ భయం తోనే!

Wednesday, January 22, 2025

హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. కాగా అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరీస్‌ టీమ్‌ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సిరీస్‌పై అంచనాలను మరింత పెంచుతుంది. ఇందులో భాగంగా దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ షూటింగ్ సమయంలో సిటాడెల్‌ ఇంకా స్క్రిప్ట్‌ దశలో ఉంది.

అందుకే ఆ సమయంలో ఈ సిరీస్ గురించి సమంతకు చెప్పలేదు. పైగా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాక హీరోగా వరుణ్‌ను ఎంచుకున్నాం. మరి హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలో ముందు తెలియదు. వరుణ్ హిందీ మాట్లాడతాడు కాబట్టి కథానాయిక కూడా హిందీ మాట్లాడేవారైతే బాగుంటుందనుకున్నాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ సమయంలో సమంత హిందీ మాట్లాడలేదు. అందుకే ఆమెను కాకుండా మరొకరిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి మేం షాక్‌ అయ్యాం.

అంత స్పష్టంగా ఆమె హిందీ ఎలా మాట్లాడిందో అర్థం కాలేదు. వెంటనే ఆమెతోనే సిరీస్‌ చేయాలని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చారు.  దర్శకుల వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ.. ‘నాకు హిందీ బాగా వచ్చు. కాకపోతే ఉచ్చారణలో లోపాలుంటాయేమోనన్న భయంతో నేను వేదికపై హిందీలో మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles