లవ్, థ్రిల్స్, యాక్షన్‌తో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో వచ్చేస్తుంది!

Sunday, December 22, 2024

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్ట్ చేయడంతో, ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం యాక్షన్, థ్రిల్స్‌తో ఈ ట్రైలర్ ఉండటంతో ప్రేక్షకుల్లో సినిమా పై మంచి అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. నిఖిల్, రుక్మిణి వాసంత్, దివ్యాంశల మధ్య సాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా కథ ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ సినిమాకు కార్తిక్ సంగీతం అందిస్తున్నారు. సన్నీ ఎంఆర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా, నవంబర్ 8న ఈ సినిమాను గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles