నటి శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త వెబ్ సిరీస్ “ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్” త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌లో సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాలా హసన్, సుభాష్ సెల్వం, వివియా సంత, ధీరజ్, హేమ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 2, 2025 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రాబోతోంది.
ఈ కథలో శ్రద్ధా ఒక గేమ్ డెవలపర్‌గా కనిపించనుంది. ఆమె జీవితంలో జరిగే ఒక అనుకోని సంఘటన కారణంగా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ ఎదురయ్యే అడ్డంకులు, రహస్యమైన విషయాలు, దాగి ఉన్న నిజాలు కథను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.
మామూలు థ్రిల్లర్‌లా కాకుండా, ఈ సిరీస్‌లో ఆధునిక డిజిటల్ యుగం మన జీవన శైలిపై చూపుతున్న ప్రభావాన్ని కూడా చూపించనున్నారు.
