35 వేల టికెట్స్‌ తో..!

Tuesday, December 9, 2025

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఓజి పై సినిమాప్రేముల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి మొదటి నుంచి చాలా బజ్ క్రియేట్ అయ్యింది. అభిమానులు కూడా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రత్యేకంగా అమెరికా మార్కెట్ లో ఈ సినిమా కలెక్షన్లు హాట్ టాపిక్ గా మారాయి. అక్కడ ప్రీమియర్ షోలు కోసం ఇప్పటికే 35 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం వల్ల ఓజి హవా ఎంతగా ఉందో అర్థమవుతుంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సెప్టెంబర్ 25న ఓజి గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles