ఇండియన్ సినిమాకు మరో కొత్త శక్తివంతమైన సూపర్ హీరో సినిమా వచ్చి సంచలనం రేపుతోంది. ఆ సినిమా పేరు లోక. ఇందులో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో మెరిశారు. ఆమెతో పాటు నటుడు నెస్లేన్ కూడా కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను దర్శకుడు డామినిక్ అరుణ్ రూపొందించారు.
థియేటర్స్ లో విడుదలైన వెంటనే ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్నమైన అనుభవాన్ని అందించింది. ముఖ్యంగా మలయాళం నుంచి వచ్చిన పెద్ద సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటికే అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం, మహిళా కేంద్రిత కథతో 100 కోట్ల వసూళ్లు దాటిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.
ఇప్పటికే అక్కడే ఆగకుండా, గ్లోబల్ మార్కెట్ లో 200 కోట్లను దాటేసి మరో కొత్త మైలురాయిని అందుకుంది.
