ఎన్టీఆర్‌ తో కలిసి అంటే ..ఛాన్స్‌ వదులుకుంటానా?

Tuesday, January 21, 2025

యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పక్కా మాస్‌ యాక్షన్‌ సినిమా దేవర. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో యంగ్‌ హీరో అల్లరి నరేష్‌ నటిస్తున్నారనే విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ విషయం గురించి అల్లరి నరేష్ స్పందించారు. తాను దేవర సినిమాలో ఎలాంటి పాత్ర చేయడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి వార్తలని ఎవరూ నమ్మోద్దని  నరేష్ వివరించారు. ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే అసలు వదులుకోనని కచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చారు.

అలాగే టాలీవుడ్ హీరోలందరిలో ఎవరితోనైనా నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నరేష్ తెలిపారు.ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మే ౩వ తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం నరేష్ ఈ చిత్రం ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు.రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ మూవీని చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజీవ్ చిలకా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles