నాని సినిమాకు ఇలాంటి టైటిల్ పెడతారా!

Sunday, December 22, 2024

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన ‘హిట్-3’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, రీసెంట్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో మొదలు పెట్టాడు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు రెండోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అప్పుడే అంచనాలు మొదలైయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త చక్కర్లు కొట్టినా అభిమానులు వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నాని-ఓదెల 2 ప్రాజెక్ట్‌కి ‘నాయుడుగారి తాలూకా’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ఓ వార్త వినపడుతుంది. దీంతో అసలు ఈ సినిమా కథ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. కానీ, ఇలాంటి టైటిల్ సినిమాకు పెడితే అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందని వారు తాజాగా చర్చలు మొదలు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles