రాజాసాబ్‌ డ్యూయెట్‌ వచ్చేస్తుందా?

Saturday, January 4, 2025

పాన్ ఇండియా  హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తురనే విషయం  అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్ మారుతి దర్శకత్వం చేస్తుండగా ఈ సినిమా వచ్చే వేసవి కానుకగా విడుదలకు సిద్దంగా ఉంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో వినపడుతుంది. ప్రభాస్ నటించిన సినిమాల్లో డ్యూయెట్ సాంగ్.. అందులో మంచి స్టెప్పులు వచ్చి చాలా రోజులే అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ప్రభాస్ నుండి ఓ సాలిడ్ డ్యూయెట్ సాంగ్ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే  రాజాసాబ్ చిత్రంలో ఓ డ్యూయెట్ ఉంటుందని.. మంచి మెలోడీగా సాగే ఈ పాటలో ప్రభాస్ అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌తో రొమాన్స్ చేయనున్నాడని సమాచారం. ఈ పాటను యూరప్‌లో చిత్రీకరించేందుకు దర్శకుడు మారుతి అండ్ టీమ్ రెడీ అవుతోందని తెలుస్తుంది. అయితే, ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం తెలియాలంటే మేకర్స్ నుండి అఫీషియల్‌గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles