తమిళ్‌లో సత్తా చాటునుందా!

Friday, December 27, 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా  ‘గేమ్ ఛేంజర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఈ సినిమాను డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పై  అంచనాలను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల కానుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే, ‘గేమ్ ఛేంజర్’ సినిమాని సంక్రాంతి బరిలో విడుదల చేయనున్నారు. తెలుగులో బాలకృష్ణ, వెంకటేష్‌ల సినిమాలతో పోటీ పడుతున్న ‘గేమ్ ఛేంజర్’ ఇక్కడ సత్తా చాటడం ఖాయమని అభిమానులు చాలా ధీమాగా ఉన్నారు. అయితే, తమిళ్‌లో మాత్రం ‘గేమ్ ఛేంజర్’ టఫ్ పరిస్థితులను ఎదుర్కోనుందనే టాక్ వినపడుతుంది. స్టార్ హీరో అజిత్ నటించిన ‘విదాముయార్చి’ చిత్రం కూడా పొంగల్ రేసులో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీని తమిళ్‌లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు  మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఎక్కువ థియేటర్లలో అజిత్ సినిమానే విడుదల కాబోతుంది. ‘గేమ్ ఛేంజర్’కు థియేటర్లు దొరికినా, తమిళ్ ఆడియన్స్ ఫస్ట్ ప్రియారిటీ అజిత్ సినిమాకే ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ లెక్కన ‘గేమ్ ఛేంజర్’కు తమిళ్‌లో టఫ్ ఫైట్‌ తప్పేలా లేదని అందరూ అనుకుంటున్నారు. మరి తమిళ్ బాక్సాఫీస్ దగ్గర ‘గేమ్ ఛేంజర్’ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles