ఏంటి అల్లు అర్జున్‌ అన్ని కోట్ల ఆఫర్ ని వద్దన్నాడా?

Wednesday, January 22, 2025

జాతీయ నటుడు అల్లు అర్జున్‌ తాజాగా నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా  పుష్ప 2. ఈ సినిమాని లెక్కల మాస్టర్ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జాతీయ స్థాయిలో హిట్‌ అయిన పుష్ప సినిమాకు సీక్వెల్‌ గా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. సుకుమార్ పుష్ప మూవీ కంటే భారీగా పుష్ప 2 సినిమాను తీర్చిదిద్దుతున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్ గా ఎంతగానో పాపులర్ అయ్యారు. అల్లుఅర్జున్ పుష్ప సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అవార్డు కూడా అందుకున్నాడు. పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ బాడీ లాంగ్వేజ్ హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

పుష్ప 2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్‌ చేసుకునేందుకు పలు వాణిజ్య సంస్థలు యాడ్స్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ ఒక యాడ్ చేయనని తెగేసి చెప్పేశారట. ఆ యాడ్ లో ఒక్క నిమిషం నటిస్తే ఏకంగా 10 కోట్లు ఆఫర్ చేశారట. కానీ అల్లుఅర్జున్ ఒప్పుకోలేదని సమాచారం. అయితే ఆ యాడ్ టుబాకోకి సంబంధించింది కావడంతో అల్లుఅర్జున్ నటించడానికి ఒప్పుకోలేదని ఇండస్ట్రీలో సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles