ఎందుకు ఈ తప్పు చేశావ్‌ !

Saturday, January 18, 2025

ఎందుకు ఈ తప్పు చేశావ్‌ ! టాలీవుడ్‌ సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ సంగీత డైరెక్టర్లలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి సినీ ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాటలు కానీ ట్యూన్స్ కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిన వినేవారికి శ్రవణానందం కలిగిస్తూ వస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల దేవిశ్రీ ప్రసాద్ కెరీర్లో మొదటిసారిగా ఓ సినిమాకి తన మ్యూజిక్ అది కూడా పాటలు కూడా కాదు నేపథ్య సంగీతం విషయంలో చాలా ఫిర్యాదులు వస్తుండడం షాకింగ్‌ విషయామనే చెప్పవచ్చు. తాను తాజాగా చేసిన భారీ చిత్రం “కంగువా” కి తన బీట్స్ చాలా ఓవర్ గా ఉన్నట్లు విమర్శలు బాగా వచ్చాయి. కానీ ఏ సినిమాకి ఇలా చేయని డీఎస్పీ ఈ సినిమాకి మాత్రం ఇలాంటి వర్క్ అందించడం అనేది కొత్త విమర్శలకు తెర లేపుతుంది. తాను ఏమన్నా కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాడా లేక సౌండ్ మిక్సింగ్ లో సరిగా చూసుకోలేదో ఏమో కానీ ఇన్నేళ్లు ఎంతో బ్యూటిఫుల్ అండ్ క్లీన్ స్కోర్ లు అందించిన దేవిశ్రీ నుంచి ఇది మాత్రం ఊహించనిదే అని చెప్పాలి. మరి దీనిపై దేవి కారణం ఏమన్నా ఫ్యూచర్ లో చెప్తాడేమో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles