సినిమాలకు దూరం అయిన మృణాల్ ఎందుకంటే! టాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ సీతారామం’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఆ సినిమాతో ప్రేక్షకుల్లో సాలిడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ ఒక్క సినిమాతో మృణాల్‌కు వచ్చిన క్రేజ్‌తో ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ వెదుకుంటూ వచ్చాయి.
అయితే, ఆమె వచ్చిన ప్రతి సినిమాను మాత్రం ఓకే చేయలేదు. దీంతో ఆమె చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, ఇటీవల ఆమె సినిమాలు చాలా వరకు తగ్గించింది. దీనికి కారణం ఏంటనేది ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. తనకు ప్రేక్షకులు మంచి ఆదరణ చూపుతున్నారని.. అందుకే ఆమె చేసే పాత్రలు వారికి నచ్చే విధంగా ఉండాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
దీని కోసమే వచ్చిన ప్రతి ఆఫర్‌ని ఓకే చేయకుండా, తనకు నచ్చిన పాత్రలు మాత్రమ ఆమె ఓకే చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల తమిళ హీరో శివ కార్తికేయన్ నటించబోయే ఓ సినిమా ఆఫర్ ఆమె వద్దకు వచ్చిందని.. అయితే, ఆమె దాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదని తెలుస్తోంది.