చరణ్ కల ఎవరు నెరవేరుస్తారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో ఓ స్పోర్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తరువాత సినిమాని క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో ఓ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇటీవల రామ్ చరణ్ తరువాత సినిమా పై ఓ సాలిడ్ బజ్ వినిపించింది. బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ డైరెక్షన్‌లో ఓ భారీ మైథలాజికల్ చిత్రంలో రామ్ చరణ్ నటించబోతున్నాడనే టాక్ తెగ వైరల్ అయ్యింది. అయితే, ఈ కాంబో ఇప్పటికే కుదిరిందని.. త్వరలోనే దీని గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. కానీ, ఈ వార్తలపై దర్శకుడు నిఖిల్ నగేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను రామ్ చరణ్‌తో ఎలాంటి మైథలాజికల్ చిత్రాన్ని రూపొందించడం లేదని ఆయన స్పష్టం చేశాడు. ఈ వార్తతో రామ్ చరణ్ ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కలను ఎవరు నెరవేరుస్తారా.. అనే దాని గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.