రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘కింగ్డమ్’ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై రిలీజ్‌కి ముందే మంచి ఆసక్తి నెలకొంది. దీంతో అభిమానులు సినిమాను థియేటర్లలో చూసేందుకు భారీగా హాజరవుతున్నారు.
ఇప్పటికే సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ హక్కులపై కూడా క్లారిటీ వచ్చింది. ఈ చిత్రానికి డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, సినిమా రిలీజ్ అయ్యిన నాలుగు వారాల తర్వాత ఇది ఓటీటీలో స్ట్రీమింగ్‌కి రానుంది. దీంతో ఆగస్టు చివరి వారం కల్లా నెట్‌ఫ్లిక్స్‌లో ‘కింగ్డమ్’ చూసే అవకాశముంటుందని టాక్.
ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించాడు. సంగీతాన్ని అనిరుధ్ అందించగా, నిర్మాణ బాధ్యతలను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి చేపట్టారు. ‘కింగ్డమ్’ విజయవంతమవుతుందనే నమ్మకంతో చిత్రబృందం ఊపులో ఉంది.
