తప్పించేదెవరు!

Tuesday, January 21, 2025

మాస్‌ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం  మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ ఆ సినిమా విడుదల సమయంలోనే మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. భాను బోగ‌వ‌రపు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది.రవితేజ, శ్రీలీల నటిస్తున్న ఈ సినిమాకు “కోహినూర్” అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. తెలంగాణ నేప‌థ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ల‌క్ష్మ‌ణ్ భేరి అనే పాత్ర‌లో రవితేజ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని కొంతకాలం క్రితం ప్రకటించారు మూవీ మేకర్స్. కానీ ఇటీవల ఈ చిత్ర షూటింగ్ సమయంలో రవితేజ గాయపడడంతో షూటింగ్ కు కొంతకాలం బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి రేస్ నుండి తప్పించారు మూవీ మేకర్స్. గాయం వల్ల షూటింగ్ ఆలస్యం అవడం కారణం కాగా, దానికి తోడు బాలయ్య, బాబీ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉంది.

ఈ రెండు కారణాలతో రవితేజ సినిమాను సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బ్రేక్ ఇచ్చిన RT75 షూట్ అక్టోబర్ 14 నుండి మరో షెడ్యుల్ మొదలు అవ్వబోతుంది. షోల్డర్ సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న మాస్ రాజా షూట్ లో పాల్గొనబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles