గత కొన్ని రోజులు నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి,నటుడు పవన్ కల్యాణ్ గురించి నేషనల్ మీడియా అంతా మాట్లాడుకుంటున్నసంగతి తెలిసిందే. మరి పవన్ కోలీవుడ్ యువ హీరో కార్తీ విషయంలో స్పందించిన తీరు ఆ అలాగే వెర్సటైల్ నటుడు ప్రకాష్ రాజ్ విషయంలో కూడా మాట్లాడ్డం వంటివి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఓ హాట్ టాపిక్.
అయితే కార్తీ చేసిన కామెంట్స్ కి తర్వాత వివరణ ఇవ్వడంతో అంతా సెటిల్ అయింది. కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ తెలుగులో పెడుతున్న పోస్ట్స్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో ఒకదాని తరువాత ఒకటి వైరల్ అవుతున్నాయి. నిన్న “చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్…” అని పోస్ట్ చేయడంతో ఎక్కడా పవన్ పేరు లేకపోయినప్పటికీ అందరికీ ఇది పవన్, కార్తీ మ్యాటర్ కోసమే అని తెలుస్తుంది.
ఇక లేటెస్ట్ గా “గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం…ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?” అంటూ మరో పోస్ట్ చేశారు. అయితే ఇందులో కూడా పవన్ పేరు ఎక్కడా లేదు కానీ పవన్ విషయంలో పరోక్షంగా మాత్రం ప్రకాష్ రాజ్ సెటైర్స్ వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి వీటిపై కూడా పవన్ నుంచి ఏమన్నా కౌంటర్ లు వస్తాయమో చూడాల్సిందే.